ఆమెకు ఇష్టం లేకుండా కండోమ్ తొలగించడం ఇకపై కుదరదు.. చట్ట విరుద్ధమని ప్రకటించిన ప్రభుత్వం

ప్రతీకాత్మక చిత్రం

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. శృంగారం చేసే సమయంలో భాగస్వామి అనుమతి లేకుండా కండోమ్ తొలగించి సెక్స్ చేయడాన్ని చట్ట విరుద్ధం చేస్తూ ఆ రాష్ట్రం బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లు తీసుకొచ్చిన తొలి రాష్ట్రం కాలిఫోర్నియానే...

 • Share this:
  కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. శృంగారం చేసే సమయంలో భాగస్వామి అనుమతి లేకుండా కండోమ్ తొలగించి సెక్స్ చేయడాన్ని చట్ట విరుద్ధం చేస్తూ ఆ రాష్ట్రం బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లు తీసుకొచ్చిన తొలి రాష్ట్రం కాలిఫోర్నియానే కావడం గమనార్హం. డెమొక్రటిక్ అసెంబ్లీ మెంబర్ క్రిస్టినా గ్రేసియా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రవేశపెట్టడంపై ఆమె మాట్లాడుతూ.. 2017 నుంచి తాను ఈ బిల్లు కోసం పోరాడుతున్నానని చెప్పారు.

  సెక్స్ చేస్తున్న సమయంలో భాగస్వామి అంగీకారం లేకుండా కండోమ్‌ను ఎలా తొలగించాలన్న విషయంపై కొన్ని ఆన్‌లైన్ కమ్యునిటీస్ సలహాలివ్వడాన్ని క్రిస్టినా తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి సలహాలివ్వడం సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు. ఇకపై.. అలా కండోమ్ తొలగించి సెక్స్ చేస్తే నేరంగా పరిగణించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అలా సెక్స్ చేస్తే బాధితురాలు దావా వేయొచ్చని తెలిపారు. వేశ్యలతో పాటు ఎవరికైనా ఈ హక్కు ఉందన్నారు. అలా బలవంతంగా కండోమ్ తొలగించి సెక్స్ చేయడం ఎదుటి వ్యక్తి నమ్మకాన్ని వమ్ము చేయడమేనని ఆమె చెప్పారు.

  ఇదిలా ఉంటే.. గ్రేసియా 2017, 2018లో కూడా రెండు సార్లు ఇదే తరహా బిల్లుల ఆమోదానికి ప్రయత్నించారు. కానీ.. అమెరికన్ సివిల్ లిబర్టీస్, కాలిఫోర్నియా రైట్ ఆఫ్ లైఫ్ కమిటీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ బిల్లులు వీగిపోయాయి. అయితే.. ఈసారి గ్రేసియా ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉందని తెలిసింది. వచ్చే నెల పాలసీ కమిటీ ముందుకు ఈ బిల్లు వెళ్లనుంది. తర్వాత బిల్లుకు సంబంధించిన శాసనాత్మక ప్రక్రియ మొదలుకానుంది.
  Published by:Sambasiva Reddy
  First published: