హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

చివరిసారిగా ముగ్గురు పిల్లల్ని చర్చికి తీసుకెళ్లి.. కన్నతండ్రి కిరాతకం: California church shooting

చివరిసారిగా ముగ్గురు పిల్లల్ని చర్చికి తీసుకెళ్లి.. కన్నతండ్రి కిరాతకం: California church shooting

కాల్పులు జరిగిన చర్చి ప్రాంతం

కాల్పులు జరిగిన చర్చి ప్రాంతం

ఓ తండ్రి తన పిల్లల్ని చర్చికి తీసుకొచ్చిమరీ అతికిరాతకంగా హతమార్చి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటో కాల్పుల ఘటనలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాలివే..

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్ కల్చర్ వర్ధిల్లింది. కాలిఫోర్నియాలో చోటుచేసుకున్న కాల్పుల్లో ఏకంగా ఐదుగురు ప్రాణాలుకోల్పోయారు. ఓ తండ్రి తన పిల్లల్ని చర్చికి తీసుకొచ్చిమరీ అతికిరాతకంగా హతమార్చి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటో సిటీలో (స్థానిక కాలమానం ప్రకారం) సోమవారం జరిగిందీ ఘటన. స్థానిక షెరీఫ్ డిపార్ట్మెంట్ చెప్పిన వివరాలివి..

కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని శాక్రమెంటోలోని ఆర్డెన్-ఆర్కేడ్ ప్రాంతంలో గల ఓ చర్చి నుంచి పోలీసులకు అలర్ట్ వెళ్లింది. తుపాకి చేతబట్టుకున వ్యక్తి ఒకడు కాల్పులు జరుపుతున్నట్లు చర్చి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన బలగాలతో పోలీసులు చర్చిని చుట్టుముట్టేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మొత్తం ఐదు శవాలతో చర్చి ప్రాంగణమంతా నెత్తురుతో నిండిపోయింది. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన విషయాలను పోలీసులు మీడియాకు చెప్పారు.

Manchu Vishnu ఆఫీసులో చోరీ: కులం పేరుతో Manchu Family అమ్మ‌నా బూతులు: హెయిర్ డ్రెసర్ నాగ శ్రీను


చనిపోయిన ఐదుగురిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారని, ఆ ముగ్గురి వయసూ 15 ఏళ్లలోపే ఉంటుందని, తండ్రే పిల్లల్ని హతమార్చాడని పోలీసులు తెలిపారు. చివరిసారిగా పిల్లలను చర్చికి తీసుకొచ్చిన తండ్రి.. ప్రార్థనలు చేస్తోన్న పిల్లలను తుపాకితో కాల్చి చంపాడని, ఆ సమయంలో చర్చిలోపలే ఉన్న మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడని, నలుగుర్ని చంపిన తర్వాత దుండగుడు తనను కాల్చుకుని చనిపోయాడని పోలీసులు వివరించారు. కాగా,

Kadapa: కామంతో కళ్లుమూసుకుపోయిన తల్లి.. ప్రియుడితో కలిసి కన్నకూతుర్ని ఏం చేసిందంటే..


తండ్రి తన ముగ్గురు పిల్లలను, అది కూడా చర్చికి తీసుకొచ్చి చంపేయడానికి దారి తీసిన కారణాలను పోలీసులు శోధిస్తున్నారు. మృతుల గుర్తింపు తర్వాత వాళ్ల బంధువులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Published by:Madhu Kota
First published:

Tags: Shooting, Us shooting, USA

ఉత్తమ కథలు