హాలీవుడ్ (Hollywood) మూవీ ఇండస్ట్రీలో తీవ్రకలకలం రేగింది. ప్రముఖ మోడల్, హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియన్ (Kim Kardashian) మేనేజర్ ఏంజెలా కుకాస్కి (Angele Kukawski) దారుణ హత్యకు గురయ్యారు. లాస్ఏంజెలెస్లో ఈ ఘటన చోటుచేసుకుంది. 55 ఏళ్ల కుకాస్కి డిసెంబరు 22 నుంచి కనిపించకుండాపోయారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న లాస్ఏంజ్లెస్ ( Los Angeles Police)పోలీసులు ఆమె కోసం వారం రోజులుగా గాలిస్తున్నారు. కానీ ఎక్కడా ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం సిమీ వ్యాలీలోని పార్టీసియా ఏవ్‌లో ఉన్న ఓ వీధిలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కారులో ఆమె మృతదేహం లభ్యమయింది. శరీరంపై పలు చోట్ల కత్తి పోట్లు ఉన్నాయి. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న లాస్ఏంజ్లెస్ పోలీసులు ఆమె బాయ్‌ఫ్రెండ్ జేసన్ బార్కర్ (49)ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు వ్యాన్ నూస్ జైల్లో ఉన్నాడు.
జేసన్ బార్కరే (Jason Barker) ఏంజెలా కుకాస్కిని అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. షెర్మన్ ఓక్స్‌లో ఉన్న ఆమె నివాసంలోనే హత్య చేసి ఉంటాడని.. అనంతరం మృతదేహాన్ని కారులో ఉంచి, పార్టీసియా ఏవ్కు తీసుకొచ్చి పార్క్ చేసి ఉంటాడని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఐతే కుక్కాస్కిని హత్య చేయాల్సిన అవసరం ఏంటి? వీరిద్దరి మధ్య ఏవైనా గొడవలు ఉన్నాయా? ఈ హత్య కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో డిటెక్టివ్స్ కూపీ లాగుతున్నారు.
ఏంజెలా కువాస్కి ఉడ్‌లాండ్ హిల్స్‌లో ఉన్న బోలివర్డ్ మేనేజ్మెంట్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. కిమ్ కర్దాషియన్ ఫ్యామిలీతో పాటు కేనీ వెస్ట్, ఆఫ్సెట్, నికీ మినాజ్, టుపక్ షాకూర్ ఎస్టేట్ వంటి హై ప్రొఫైల్ సెలబ్రిటీలకు బిజినెస్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమె మృతి పట్ల బోలివర్డ్ మేనేజ్మెంట్ కంపెనీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మా సహచర ఉద్యోగిని కోల్పోవడంతో తమ హృదయం ముక్కలయిందని ఆ కంపెనీ ప్రతినిధి టాడ్ బోజిక్ పేర్కొన్నారు. ఆమె చాలా మంచి వ్యక్తి అని.. అలాంటి మనిషి ఇవాళ మన మధ్య లేకపోవడం బాధాకరమని ఒక ప్రకటనలో తెలిపారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.