ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా (China). వరల్డ్ మీటర్స్ (World Meters) 2022 అనధికారిక లెక్కల ప్రకారం.. 145 కోట్లు. భారత జనాభా 140 కోట్లు. అంటే చైనా మొదటి స్థానంలో ఉండగా.. భారత్ రెండో ర్యాంకులో ఉంది. ఐతే ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనా (China Population)కు.. ఇప్పుడు జనాభా సమస్య వచ్చి పడింది. జనాభా పెంచాలని ప్రభుత్వ ప్రోత్సహిస్తున్నా..అక్కడి ప్రజలు మాత్రం నో అంటున్నారు. పిల్లలను కొనేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలోనే పలు చైనా కంపెనీలు (Chinese Companies) ఉద్యోగులకు అద్భుతమైన ఆఫర్లను ఇస్తున్నాయి. ఎంత మంది ఎక్కువ బిడ్డను కంటే.. అన్ని ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఓ చైనీస్ కార్పొరేట్ కంపెనీ సంచలన ప్రకటన చేసింది.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బీజింగ్‌లోని ది బీనాంగ్ టెక్నాలజీ గ్రూప్ తన ఉద్యోగుల కోసం అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. మూడో బిడ్డకు జన్మనిచ్చే ఉద్యోగులకు ఏడాది వరకు సెలవులు లభిస్తాయి. అంతేకాదు 11.50 లక్షల రూపాయల (90,000 చైనీస్ యువాన్) రివార్డు కూడా ఇస్తారు. ఉద్యోగుల్లో ఎవరైనా మొదటి బిడ్డను కంటే.. వారికి 30వేల యువాన్‌లు అంటే రూ.3.50 లక్షల నగదును బోనస్‌గా ఇస్తారు. రెండో సంతానం కలిగిన వారు 60వేల యువాన్లు బోనస్ పొందుతారు. రెండో బిడ్డను కంటే ఏడున్నర లక్షల నగదును ఇస్తారు. ఇక ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండి.. మూడో బిడ్డను కనే ఉద్యోగులకు ఏకంగా.. 11.50 లక్షల నగదును అందజేస్తారు. అంతేకాదు మూడో బిడ్డను కలిగిన మహిళా ఉద్యోగులకు ఏడాది పాటు సెలవులు ఇస్తారు. పురుషులు 9 నెలల పాటు లీవ్ పొందవచ్చు. ముగ్గురు పిల్లల ప్రభుత్వ విధానానికి మద్దతుగా ది బీనాంగ్ టెక్నాలజీ గ్రూప్ ఈ పథకాన్ని ప్రారంభించింది.
Snooze at work : ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్..మధ్య్నాహం ఓ అరగంట హాయిగా నిద్రపోవచ్చు
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనాలో.. జనాభా నియంత్రణ కోసం 1980లో 'వన్ చైల్డ్ పాలసీ'ని అమలు చేశారు. దాదాపు 40-45 వరకు ఈ విధానం అమలుచేశాక.. అసలుకే మోసం వచ్చింది. జనాభా నియంత్రణ వల్ల దేశంలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరగడం మొదలైంది. అదే సమయంలో యువత సంఖ్య తక్కువగా ఉంది. అంటే పనిచేసే యువత సంఖ్య తగ్గిపోవడం వల్ల అనేక ఇతర సమస్యలు వచ్చాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపబోతుందన్న ముప్పును ముందే పసిగట్టి.. ఆ దిశగా చర్యలకు దిగింది చైనా సర్కార్. ఈ క్రమంలోనే ప్రభుత్వం 2016లో 'ఒక బిడ్డ పాలసీ'ని రద్దు చేసింది. తల్లిదండ్రులు ముగ్గురు పిల్లలను కూడా కనవచ్చని.. ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేసింది.
Video Viral: ప్రియురాలితో కలిసి పెళ్లం కంట పడ్డాడు..మనోడి సీన్ చూడండి ఎలా ఉందో
ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేసినా.. ఆశించిన ఫలితాలు రాలేదు. ఎక్కువ మంది పిల్లలను కొనేందుకు చైనా యువత ఇష్ట పడడం లేరు. 'ఒక్కరే ముద్దు' అనే పాత నినాదానికే కట్టుబడి ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి మద్దుగా కార్పొరేట్ కంపెనీలు కూడా ముందుకొస్తున్నాయి. ఎక్కువ మంది పిల్లలు కనేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నాయి. చాలా కంపెనీలు 2021 నుండి 'త్రీ చైల్డ్ పాలసీ' కింద తమ ఉద్యోగులను ప్రోత్సాహకాలు అందజేస్తున్నాయి. మరి ఇప్పటికైనా చైనీయుల్లో మార్పు వస్తుందా? లేదంటే వృద్ధుల సంఖ్య అలాగే పెరుగతూపోయి.. ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లుతుందా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, International, International news, Population