హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

వామ్మో.. భూమి నుంచి గాల్లో ఉన్న విమానంపైకి ఫైరింగ్.. క్యాబిన్ లో ఏంజరిగిందంటే..

వామ్మో.. భూమి నుంచి గాల్లో ఉన్న విమానంపైకి ఫైరింగ్.. క్యాబిన్ లో ఏంజరిగిందంటే..

విమానంకు పడిన రంధ్రం

విమానంకు పడిన రంధ్రం

Myanmar: నెల మీద నుంచి గాల్లో ఉన్న విమానంపైకి బుల్లెట్ ల వర్షం కురిసింది. దీంతో క్యాబిన్ లో ఉన్నవారు ఒక్కసారిగా షాకింగ్ కు గురయ్యారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

మయన్మార్ లో (Myanmar) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మయన్మార్ నేషనల్ ఎయిర్ లైన్స్ లో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో.. అతను నైపిటావ్ నుంచి లోయికావ్ కు వెళ్తున్నాడు. అతను విమానం క్యాబిన్ లో కూర్చుని ఉండగా ఒక్కసారిగా బుల్లెట్ లు వచ్చి అతనికి తగిలాయి. విమానానికి రంధ్రాలు కూడా పడ్డాయి. ఆ వ్యక్తి కూర్చున్న ప్రాంతమంతా రక్తసిక్తంగా మారిపోయింది. వెంటనే విమానయాన అధికారులు అత్యవసరంగా ల్యాండింగ్ చేసి గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

మయన్మార్ నౌ ప్రకారం.. 63 మంది ప్రయాణికులతో వెళ్తున్న ATR-72 విమానం, భూమి నుంచి 3,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో కాల్చబడిందని అధికారులు తెలిపారు. విమానంలో ఉన్న వ్యక్తి ముఖం యొక్క కుడి వైపున గాయమైంది. ప్రయాణికుడిని ఢీకొనేలోపు బుల్లెట్ విమానంలోకి దూసుకెళ్లిందని అధికారులు తెలిపారు. మయన్మార్ సైనిక మండలి రెండు ప్రతిఘటన దళాలు - కరెన్ని నేషనల్ ప్రోగ్రెసివ్ పార్టీ (KNPP), పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ - విమానంపై కాల్పులు జరిపాయని ఆరోపించింది. అయితే, KNPP ఆరోపించిన కాల్పుల్లో తమ సంస్థ ప్రమేయం లేదని నివేదించింది.

ఇదిలా ఉండగా ఇండోనేసియా (Indonesia) లో తీవ్ర విషాదం నెలకొంది. ఓఫుట్ బాల్ స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 127 మంది మరణించారు. మరో వంద మందికి పైగా గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.   ఈస్ట్ జావాలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.   ఇండోనేసియా టాప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ ''లీగా 1'' (Liga 1)లో భాగంగా.. శనివారం మలాంగ్ రీజన్సీలోని కంజురుహాన్ స్టేడియం (kanjuruhan football stadium)లో ఎరీమా ఎఫ్‌సీ, పెర్సిబయా సురబాయా జట్ల మధ్య  ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. ఐతే  ఎరీమా ఎఫ్‌సీ టీమ్ ఓడిపోవడంతో ఆ జట్టు అభిమానులు స్టేడియంలో రచ్చ  చేశారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, ఇతర వస్తువులు విసిరారు. కుర్చీలు విరగ్గొట్టారు. స్టేడియంలోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గ్రౌండ్‌లోకి వెళ్లి ప్రేక్షకులపై లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ కూడా ప్రయోగించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అభిమానులంతా పరుగులు తీయడంతో.. తొక్కిసలాట జరిగింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Myanmar, VIRAL NEWS

ఉత్తమ కథలు