Home /News /international /

BROKEN AND OUT OF CONTROL CHINESE ROCKET MAY HIT ANYWHERE ON EARTH CAN BRING DISTRUCTION SK

Chinese Rocket: భూమి వైపు దూసుకొస్తున్న చైనా రాకెట్.. ఎప్పుడు.. ఎక్కడైనా పడొచ్చు.. విధ్వంసం తప్పదా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

China Rocket: రాకెట్ ఎక్కడ పడుతుందో ఊహించడం సాధ్యం కాదని ఖగోళ శాస్త్రవేత్త గిజ్మోడో తెలిపారు. అంత పెద్ద శకలం వేగాన్ని నియంత్రించకుండా.. దారి మళ్లించడం చాలా ప్రమాదకరమని అన్నారు. ప్రమాద తీవ్రతను అంచనా వేయడం కూడా కష్టమని పేర్కొన్నారు.

ఇంకా చదవండి ...
    రెండున్నరేళ్లు గడిచినా ఇప్పటికే కరోనాడ (Coronavirus) పీడ విరగడవ్వలేదు. ఇంకా కేసులు వస్తూనే ఉన్నాయి. ప్రజలు చనిపోతూనే ఉన్నారు. యావత్ ప్రపంచాన్ని గజగజా వణికించిన ఈ కరోనా వైరస్ చైనాలో పుట్టింది. వ్యూహాన్ మార్కెట్ నుంచే వ్యాపించిందని ఎన్నో దేశాలు తేల్చిచెప్పాయి. శాస్త్రవేత్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు చైనా (China) కావాలనే.. ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను తయారు చేసిందనే ప్రచారమూ జరిగింది. కరోనా రూపంలో జీవాయుధాలను తయారుచేసిందని.. వాటిని ప్రపంచం మీదకు వదిలి.. విధ్వంసం సృష్టించాలని కుట్ర చేసిందని విమర్శలున్నాయి. ఇందులో నిజమెంతో తెలియనప్పటికీ.. చైనాలో పుట్టని ఈ వైరస్ మాత్రం ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించింది. ఐతే తాజాగా చైనా చేసిన మరో చర్య.. మళ్లీ అందరినీ వణికిస్తోంది.

    ఓ చైనీస్ రాకెట్ (Chinese Rocket) అంతరిక్షంలో అనేక ముక్కలుగా విరిగిపోయింది. ఇప్పుడా శకలాలు భూమి వైపు వేగంగా దూసుకొస్తున్నాయి. 30 మీటర్ల పొడవు.. 21 టన్నుల ఈ రాకెట్ శిథిలాలు.. ఎప్పుడు ఎక్కడ పడతాయో ఎవరికీ తెలియదు. భూమి వైపు వేగంగా కదులుతోందన్న విషయం మాత్రమే తెలుసు. ప్రపంచంలో ఎక్కడైనా అది నేల కూలొచ్చు. ఈ రాకెట్ బరువు మూడు టి-రెక్స్ డైనోసార్‌లకు సమానం. అది ఎక్కడుందో.. ఏ దిశలో వస్తుందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అది ఖచ్చితంగా ఎక్కడుందో తెలిస్తేనే.. దిశను మార్చేందుకు సాధ్యమవుతుంది.

    చైనాకు చెందిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్‌ను ఆదివారం రోజు అంతరిక్షంలో ప్రయోగించారు. నిర్మాణ దశలో ఉన్న అంతరిక్ష కేంద్రానికి మాడ్యూల్‌ను తరలించింది. ఐతే ఆ రాకెట్ అనేక ముక్కలుగా విడిపోయింది. అందులో కొన్ని పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి. ఈ రాకెట్ మాడ్యూల్ సురక్షితంగా ఉంది. కానీ లాంచర్ మాత్రం భూమి వైపు వేగంగా దూసుకొస్తోంది. ఈ రాకెట్ భూమిపై ఎప్పుడు, ఎక్కడ ఢీకొంటుందనే ఆలోచనే లేదని ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్‌డోవెల్ హెచ్చరించారు. అయితే ఎక్కడ పడితే అక్కడ.. పెద్ద విధ్వంసమే జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.



    ఈ రాకెట్ ఎక్కడ పడుతుందో ఊహించడం సాధ్యం కాదని ఖగోళ శాస్త్రవేత్త గిజ్మోడో తెలిపారు. అంత పెద్ద శకలం వేగాన్ని నియంత్రించకుండా.. దారి మళ్లించడం చాలా ప్రమాదకరమని అన్నారు. ప్రమాద తీవ్రతను అంచనా వేయడం కూడా కష్టమని పేర్కొన్నారు. ఏం చేయాలన్న దానిపై ఖగోళ నిపుణులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. దాని మార్గాన్ని మళ్లించడమా... లేదంటే మరిన్ని ముక్కలుగా విడగొట్టడా? అనే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఇది కొన్ని వందల కిలోమీటర్లు వేగంతో కదులుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వేగంతో ఢీకొంటే విధ్వంసం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా అంతరిక్ష శకలాలను సముద్రంలోకి మళ్లిస్తారు. కంట్రోల్ తప్పిన ఈ చైనీస్ రాకెట్ శకలాన్ని కూడా సముద్రంలోనే ముంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: China, International, International news, Rocket

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు