అంటార్కిటికా మంచు కింద వింత జీవి.. దాని గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

(Image-Twitter/Huw Griffiths)

ఈ విశ్వంలో ఎన్నో వింతలు, విచిత్రాలు ఉన్నాయి. అసలు భూమిపైనే మనకు తెలియని ఎన్నో నిగూఢ ప్రదేశాలు, జీవరాశులు కోకొల్లలు.

  • Share this:
ఈ విశ్వంలో ఎన్నో వింతలు, విచిత్రాలు ఉన్నాయి. అసలు భూమిపైనే మనకు తెలియని ఎన్నో నిగూఢ ప్రదేశాలు, జీవరాశులు కోకొల్లలు. అందులోనూ ముఖ్యంగా సముద్రాల్లో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఒక వంతు భూభాగముంటే.. మూడొంతుల మేర నీళ్లే ఉన్నాయి. సముద్ర అడుగు భాగంలో 80 శాతం మేర ఇప్పటి వరకూ గుర్తించని, ఏముందో కనిపెట్టని జీవులు ఉన్నాయని యునైటెడ్ స్టేట్ నేషనల్ ఓషన్ సర్వీస్ తెలిపింది. తాజాగా బ్రిటిష్ శాస్త్రవేత్తలు సముద్రపు అడుగు భాగంలో ఓ వింతైన, వికారమైన జీవిని అనుకోకుండా కనుగొన్నారు. అంటార్కిటికా మంచు పొరల కింద ఇది జీవిస్తోంది.

కెమెరాల ద్వారా గుర్తింపు..
ఆగ్నేయ వెడెల్ సముద్రం వద్ద ఉన్న ఫ్లించర్ ఐస్ షెల్ఫ్ పై పరిశోధనలో భాగంగా బ్రిటిష్ అంటార్కిట్ సర్వే, పొలార్ శాస్త్రవేత్తల బృందం బయలుదేరాయి. ఈ సమయంలో సముద్రపు అడుగుభాగంలో ఓ బండరాయిని పరిశీలించగా ఇది వారిని షాక్ కు గురిచేసింది. సముద్రపు అడుగు భాగానికి చేరుకోవడానికి ఐస్ షెల్ఫ్ ద్వారా రంధ్రం చేసి దాని గుండా గోప్రో కెమేరాను కిందకు పంపారు. అనంతరం ఆ కెమేరా ఫుటేజి పరిశీలించగా స్పాంజి లాంటి జీవులను చూసి ఆశ్చర్యపోయారు. అంతకుముందు ఈ బండరాళ్ల కింద అంతుచిక్కని అనేక జీవరాశులు ఉన్నట్లు గుర్తించారు. "పూర్తిగా చీకటిగా ఉన్న ఈ ప్రదేశం వద్ద ఉష్ణోగ్రత -2.2 డిగ్రీలు. ఈ పరిస్థితుల్లో చాలా తక్కువ జీవరాశులు మాత్రమే జీవించి ఉండగలవు, అయితే ఇంతవరకు ఇలాంటి వాటిని గుర్తించలేదు" అని శాస్త్రవేత్తలు తెలిపారు. పగటి పూట వెలుతురులో గమనించినప్పుడు ఈ ప్రదేశం తామున్న చోటుకు 260 కిలోమీటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇది మంచుకు చివరి అంచు. ఇక్కడి నుంచి బహిరంగ సముద్రం ప్రారంభమవుతుంది.అదృష్టవశాత్తు దొరికింది..
బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వేకు చెందిన శాస్త్రవేత్తలు వేరే అంశాలపై పరిశోధనలు నిర్వహిస్తున్నప్పుడు అదృష్టవశాత్తు ఈ జీవులను గుర్తించారు. ఈ జీవులను గుర్తించడం ఎన్నో రకాల పరిశోధనలు చేసేందుకు మార్గం చూపుతుందని అంటార్కిటిక్ సముద్రపు జీవితం చాలా ప్రత్యేకమైందని వారు వెల్లడించారు. అయితే శాస్త్రవేత్తలు చూసిన ఈ జీవులు ఏ జాతికి చెందినవో స్పష్టంగా తెలియదు. అవి అసలు ఎందుకు అక్కడ జీవనం సాగిస్తున్నాయే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. తమ ఆవిష్కరణ ఓ కొత్త జీవిని కనిపెట్టడంతో పాటు ఎన్నో ప్రశ్నలను లేవనెత్తిందని బయోజియోగ్రాఫర్ డాక్టర్ గ్రిఫిత్స్ అభిప్రాయపడ్డారు. మంచు అడుగున నివసిస్తున్న ఈ జీవరాశులు కొత్త జాతులా కాదా? మంచు కరిగితే అవి ఎక్కడకు వెళ్తాయి లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయని తెలిపారు.
Published by:Sumanth Kanukula
First published: