విధుల్లో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

మూడు వారాల విరామం తరువాత ఆయన 10 డౌనింగ్ స్ట్రీట్‌లో తమ కార్యాలయానికి వెళ్లినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

news18-telugu
Updated: April 27, 2020, 11:34 PM IST
విధుల్లో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
బోరిస్ జాన్సన్
  • Share this:
కరోనా నుంచి కోలుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తిరిగి అధికారిక బాధ్యతలు చేపట్టారు. మూడు వారాల విరామం తరువాత ఆయన 10 డౌనింగ్ స్ట్రీట్‌లో తమ కార్యాలయానికి వెళ్లినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కరోనా నియంత్రణ చర్యలపై దేశ ఆరోగ్య మంత్రి , ఉన్నతాధికారులతో చర్చించినట్లు డౌనింగ్ స్ట్రీట్ అధికారులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో బ్రిటన్ అధికార యంత్రాంగం విఫలం అయిందని దేశ ప్రతిపక్ష నేత కియిర్ స్టార్మెర్ ఇప్పటికే ప్రధానికి లేఖ రాశారు. ఇందులో ఆయన పేర్కొన్న పలు అంశాలు ఇప్పుడు తీవ్రస్థాయిలో దుమారం రేపాయి. బుధవారం ప్రధాని వీక్లీ ప్రశ్నోత్తరాల కార్యక్రమం సందర్భంగా వీటిపై స్పందిస్తారని, ప్రస్తుత వైద్య చికిత్స విధానాలపై ఉన్నత స్థాయిలో సమీక్షిస్తారని వెల్లడైంది.

కరోనాతో విషమ పరిస్థితిని ఎదుర్కొన్న ప్రధాని ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. చికిత్స తరువాత ఆయన క్రమేపీ కోలుకున్నారు. ఈ నెల 12వ తేదీన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దేశ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్‌కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు.
Published by: Krishna Adithya
First published: April 27, 2020, 11:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading