BRITISH PRIME MINISTER BORIS JOHNSON HAS APOLOGIZED TO THE PEOPLE OF THE COUNTRY FOR THE CRITICISM LEVELED AT HIM BY CORONA FIRSTWAVE SNR
ఆ నాడు నేను చేసింది తప్పే ..నన్ను క్షమించండి..బ్రిటన్ ప్రధాని చేసిన ఆ తప్పేంటి..?
Photo Credit: Youtube
Boris Johnson: దేశ ప్రజలు కరోనా కష్టల్లో ఉంటే మీరు పార్టీలు చేసుకుంటారా అంటూ విపక్షాలు బ్రిటన్ ప్రధానిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పార్లమెంట్ సాక్షిగా క్షమించమని కోరినా బోరిస్ జాన్సన్‌ని వదలడం లేదు. చేసిన ఒక్క తప్పు కోసం పశ్చాత్తాపంతో పార్లమెంట్లో తలదించుకున్నారు బోరిస్ జాన్సన్.
ఆ దేశ ప్రధాని(Prime Minister)క్షమాపణ చెప్పారు. దేశ ప్రజలందరికి పార్లమెంట్ సాక్షిగా క్షమించండి (Apologized)అంటూ కోరారు. రాజ్యమేదైనా..రాజైనా, ప్రజలైనా నిబంధలు పాటించాల్సిందే. ఈ విషయంపైనే బ్రిటన్British ప్రధాని బోరిస్ జాన్సన్ (Prime Minister Boris Johnson)ఆదేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అసలు ఆయన ఎందుకు క్షమాపణ కోరాల్సి వచ్చిందంటే 2020 మే నెల(May 20,2020)లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఫస్ట్‌వేవ్‌లో దేశ ప్రజలంతా ప్రాణభయంతో గడుపుతున్న సమయంలో బ్రిటన్‌లో లాక్డౌన్ విధించారు. దేశంలో లాక్డౌన్ అమలవుతంటే ప్రధాని బోరిస్ జాన్సన్ ఆయన భార్య క్యారీ(Carrie)తో కలిసి డౌనింగ్ స్ట్రీట్(Downing Street)లో జరిగిన పార్టీకి అటెండ్ అయ్యారు. బ్రింగ్ యువర్ ఓన్ బూజ్ పేరుతో నిర్వహించిన మందు పార్టీలో పాల్గొన్నారు. అది కూడా ప్రభుత్వ కార్యాలయంలోనే జరగడంతో వ్యవహారం మీడియా ద్వారా దేశ ప్రజలందరికి తెలిసిపోయింది. ఈ పార్టీకి సంబంధించిన ఆధారాలు మీడియాలో రావడంతో విపక్షాలు బోరిస్ రాజీనామాకు పట్టుబట్టాయి. దేశ ప్రజలు కరోనా భయంతో ఉన్న సమయంలో ఒక ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి అలా చేయవచ్చా అని ప్రశ్నించాయి. బ్రిటన్ ప్రధాని పదవికి గండం తెచ్చే విధంగా తయారైన పార్టీ విషయంపై బోరిస్ జాన్సన్ దేశ ప్రజలంతా తనను క్షమించాలని కోరారు.
నిబంధనలు మీరే ఉల్లంఘిస్తే ఎలా..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా థర్డ్‌వేవ్ కొనసాగుతున్న ఈ సమయంలో బ్రిటన్ పార్లమెంట్లో చర్చకు వచ్చింది. దీనిపై విపక్షాల పార్లమెంటేరియన్లు బోరిస్ జాన్సన్ రాజీనామాకే పట్టుబట్టారు. కేవలం సామాజిక సమావేశాలకు మాత్రమే అనుమతి ఉన్న లాక్డౌన్సమయంలో డౌనింగ్ స్ట్రీట్‌లో జరిగిన పార్టీకి తాను మొదటిసారి హాజరయ్యానని స్వయంగా అంగీకరించారు. ఈఘటనపై ప్రజలు, విపక్షాలకు తనపై వచ్చిన కోపాన్ని అర్ధం చేసుకున్నానంటూ పశ్చాత్తాప హృదయంతో స్పందించారు.
ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిందే..
ఆదేశాలు, నిబంధనలు రూపొందించే స్థాయిలో ఉన్న వ్యక్తులు పాటిని సరిగా పాటించకపోతే ప్రజలు, విపక్షాల స్పందన ఎలా ఉంటుందో...ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు వస్తాయో తాను అర్ధం చేసుకోగలననని పార్లమెంట్లో స్పీకర్ ముందు అంగీకరించారు. అలాంటి సంఘటనపై తాను చింతిస్తున్నానని..ప్రజలు, విపక్ష సభ్యుల విమర్శలకు బదులుగానే తాను క్షమాపణ కోరుతున్నానని చెప్పారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.
క్షమాపణ కోరిన బ్రిటన్ ప్రధాని..
బ్రిటన్ ప్రధాని పార్లమెంట్లో క్షమాపణ చెప్పినప్పటికి విపక్ష సభ్యులు శాంతించలేదు. చేసిన తప్పుకు క్షమాపణ కోరితే సరిపోదని ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తే అలా చేస్తే నిబంధనలు ఎవరూ పాటిస్తారంటూ ప్రతిపక్ష పార్లమెంటేరియన్ కార్ల్ టర్నర్ బోరిస్ చర్యలను మరోసారి గుర్తు చేశారు. బోరిస్ జాన్సన్ చేసిన పొరపాటును విపక్ష సభ్యుడు పదే పదే సభలో గుర్తు చేస్తుండగా బ్రిటన్ ప్రధాని ఒకింత అసహనానికి, అవమానానికి లోనయ్యారు. ప్రతి విమర్శకు బదులిచ్చేందుకు ప్రయత్నించారు బోరిస్ జాన్సన్.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.