రోడ్డుపై వింత వాహనం... ఆపి, ఆశ్చర్యపోయిన పోలీసులు...

Britain : అది పడవో, బైకో, కారో, విమానమో, హెలీకాప్టరో... ఏదో పోలీసులకు అర్థం కాలేదు. అందుకే దాన్ని ఆపేసి... పూర్తి వివరాలు తెలుసుకొని... ఆశ్చర్యపోయారు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 21, 2019, 9:12 AM IST
రోడ్డుపై వింత వాహనం... ఆపి, ఆశ్చర్యపోయిన పోలీసులు...
వింత వాహనం (Image : Twitter - Traffic Sergeant)
  • Share this:
బ్రిటన్‌లో... బెడ్‌ఫోర్డ్‌షైర్ పోలీసులు... రోడ్డుపై వెళ్తున్న ఆ వాహనాన్ని చూసి షాకయ్యారు. ఇంతకు ముందెప్పుడూ అలాంటి వాహనాన్ని వాళ్లు చూడలేదు. వెంటనే ఆ రూట్‌లో ఉన్న కేంబ్రిడ్జిషైర్ పోలీసులకు ఆ వాహనాన్ని అడ్డుకోమని కాల్ చేసి చెప్పారు. ఐతే... ఆ వెహికిల్ అటు వెళ్లలేదు. అలర్టైన పోలీసులు... హెర్ట్‌ఫోర్డ్‌షైర్ పోలీసులకు కాల్ చేసి విషయం చెప్పారు. అలర్టైన అక్కడి పోలీసులు... M25 హైవేపై వేగంగా వెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. అందులో ఏ ఉగ్రవాదో ఉండి ఉండొచ్చని... దాని చుట్టూ గన్స్‌తో నిలబడ్డారు. అంతలో... అందులోంచీ... రెండు చేతులూ పైకి ఎత్తి బయటకు వచ్చాడు ఓ వ్యక్తి. అది ఎలక్ట్రిక్ స్కూటర్‌ అనీ... తానే దాన్ని తయారుచేశాననీ... అందుకోసం బల్సా కలప, డక్ట్ టేప్ వాడినట్లు అతను వివరించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన పోలీసులు... తమ 26 ఏళ్ల సర్వీసులో ఇలాంటి వాహనాన్ని ఎప్పుడూ చూడలేదని తెలిపారు.


పోలీసులు చెక్ చేస్తే... ఆ వాహనానికి లైసెన్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ అన్నీ పక్కాగా ఉన్నాయి. అందుకే చేసేదేమీ లేక... దాన్నీ, దాని డ్రైవర్‌నూ వదిలేశారు. ఇప్పుడు ఆ వెహికిల్‌కి సంబంధించిన మరిన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.


Published by: Krishna Kumar N
First published: August 21, 2019, 9:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading