BRITISH MEDIA SAY UK PRIME MINISTER BORIS JOHNSON HAS AGREED TO RESIGN HERE ARE MORE DETAILS SK
Boris Johnson: రాజీనామాకు అంగీకరించిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. కానీ ఓ కండిషన్
బోరిస్ జాన్సన్
బ్రిటన్ కొత్త ప్రధాని రేసులో మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ (Rishi sunak), విదేశీ కామన్ వెల్త్ అండ్ డెవలప్మెంట్ అఫైర్స్ సెక్రటరీ లిజ్ ట్రస్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రిషి సునక్ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి అల్లుడవుతారు.
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ (Britain PM Boris Johnson) తన పదవికి రాజీనామా చేసందుకు అంగీకరించినట్లు సమాచారం. ఇప్పటికే 40 మందికి పైగా మంత్రులు ఆయనపై తిరుగుబాటుచేసి రాజీనామా చేయడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో పదవి నుంచి తప్పుకునేందుకు బోరిస్ జాన్సన్ అంగీకరించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ అసోసియేట్ ప్రెస్ పేర్కొంది. ఐతే ఇందుకు ఆయన ఓ షరతు విధించారట. కన్జర్వేటివ్ పార్టీ (Conservative Party) కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు..తన పదవిలో కొనసాగుతానని స్పష్టం చేసినట్లు సమాచారం.
యూకే మీడియా కథనాల ప్రకారం.. బ్రిటన్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు 50 మందికి పైగా మంత్రులు, ఎంపీలు రాజీనామా చేశారు. ప్రభుత్వంపై అవిశ్వాసం ఎంతగా పెరిగిపోతోందంటే.. 36 గంటల క్రితం మంత్రి పదవి పొందిన మిచెల్ డొనెలన్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం సాయంత్రం వరకు 17 మంది క్యాబినెట్ మంత్రులు, 12 మంది పార్లమెంటరీ కార్యదర్శులు, నలుగురు విదేశీ ప్రభుత్వ ప్రతినిధులు రాజీనామాను ప్రకటించారు. బోరిస్ జాన్సన్ పాలనపై వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరోనా సంక్షోభాన్ని సరిగ్గా ఎదుర్కోలేకపోయారని, లాక్డౌన్ నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులుకు గురి చేశారని.. ఆయనపై ప్రజలతో పాటు మంత్రులు కూడా మండిపడుతున్నారు. అంతేకాదు బోరిస్ జాన్సన్ సెక్స్ స్కాండల్‌పై వస్తున్న ఆరోపణలను కూడా ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రులు, ఎంపీల నుంచి తీవ్రంగా ఒత్తిడి రావడంతో.. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని బోరిస్ నిర్ణయించుకున్నారు.
బ్రిటన్ కొత్త ప్రధాని రేసులో మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ (Rishi sunak), విదేశీ కామన్ వెల్త్ అండ్ డెవలప్మెంట్ అఫైర్స్ సెక్రటరీ లిజ్ ట్రస్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కరోనా రిలీఫ్ ప్యాకేజీ కారణంగా సునక్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. ప్రధానమంత్రి పదవి కోసం రిషి సునక్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే ఆయన భార్య అక్షతా మూర్తి కూడా యాక్టివ్‌గా మారారు. అక్షత ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె. అంటే నారాయణమూర్తికి ఆయన అల్లుడవుతారు. గురువారం సునక్ ఇంట్లో విలేకరుల సమావేశం జరగ్గా.. అక్షత అందరికీ టీ తీసుకొస్తూ.. కనిపించారు. రిషి సునక్‌తో పాటు లిజ్ ట్రుజ్, బెన్ వాలెన్స్, మిచెట్ గోవ్, సాజివ్ జావిద్ కూడా ప్రధాని మంత్రి రేసులో ఉన్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.