పార్ట్‌నర్‌తో సెక్స్.. నిలువుగా కోసుకుపోయిన పురుషాంగం.. ప్రపంచంలో ఇదే తొలి కేసు

నిలువుగా కోసుకుపోయిన పురుషాంగం (Image credit: British Medical Journal)

మనం ఇప్పటివరకు పురుషాంగాన్ని అడ్డంగా కోసిన కేసులు తెలుసుకుంటున్నాం. ఇది అందుకు భిన్నమైన కేసు... అసలు సెక్స్‌లో పాల్గొంటే... పురుషాంగం నిలువుగా ఎలా కోసుకుపోయింది... అతని విషయంలో ఏం జరిగిందో తెలుసుకుందాం.

 • Share this:
  బ్రిటన్‌కి చెందిన ఓ 40 ఏళ్ల వ్యక్తి కేసు తీవ్ర కలకలం రేపింది. ఎందుకంటే ప్రపంచంలో ఇలాంటి కేసుల్లో ఇదే మొదటిది. పేరు బయటకు రాని ఆ వ్యక్తి పురుషాంగం నిలువుగా కోసుకుపోయింది. (చీరుకుపోయింది). అతను తన పార్ట్‌నర్‌తో సెక్స్‌లో పాల్గొన్నాడు. సెక్స్ చేస్తున్నప్పుడే ఇలా జరిగిందట. పార్ట్‌నర్‌కి చెందిన పెరెనియం (perineum - the area between the anus and genitals) భాగంలో పురుషాంగం ఇరుక్కుపోయింది. అక్కడే ఏదో జరిగి... నిలువుగా, రెండుగా చీలిపోయింది. ఈ కేసు వివరాల్ని బ్రిటిష్ మెడికల్ జర్నల్ (BMJ)లో రాశారు.

  "పురుషాంగంలో ఎముకలు ఉండవు కాబట్టి... ఎముకల గాయాల వంటివి ఏవీ జరగలేదు. ఐతే... అతను సెక్స్ చేస్తున్నప్పుడు పురుషాంగాన్ని ఆసాధారణ రీతిలో వంచాడు. దాని వల్ల ముందుభాగంలో చీలిక మొదలైంది. అయినా అతను వెనక్కి తగ్గలేదు. దాంతో... చీలిక పెద్దదై... 3 సెంటీమీటర్లు నిలువుగా చీలిపోయింది" అని డాకర్లు తెలిపారు.

  "ఇప్పటివరకూ ఇలాంటి కేసు రాలేదు. గతంలో వచ్చినవన్నీ అడ్డంగా తెగిన పురుషాంగం కేసులే. ఈ కేసులో మాత్రం ట్యునికా అల్బుజినియా (tunica albuginea) రెండుగా చీలింది. ఐతే... చీలుతున్నప్పుడు ఈ విషయం అతనికి తెలియలేదట. కనీసం ఏ సౌండూ రాలేదని తెలిపాడు" అని డాక్టర్ చెప్పారు.

  "సాధారణంగా... పురుషాంగం స్తంబించాక... వెంటనే సాధారణ స్థితికి రాదు. ఇలాంటి కేసుల్లో వెంటనే సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఈ కేసులో అలా వచ్చిన తర్వాత అది ఉబ్బిపోయింది. MRI స్కాన్ తీసినప్పుడు... కుడివైపుకి 3 సెంటీమీటర్లు చీలిపోయినట్లు తెలిసింది" అని డాక్టర్లు చెప్పారు.

  "అతను మళ్లీ 6 నెలల తర్వాత ఎప్పట్లాగే సెక్స్‌లో పాల్గొనవచ్చు. అంగం ఇదివరకటి లాగే స్తంభించినా... ఎలాంటి సమస్యలూ ఉండవు. దీనిపై అతను ఆందోళన చెందాల్సిన పని లేదు" అని డాక్టర్లు తెలిపారు.

  ఇది కూడా చదవండి: Online Classes: ఆన్‌లైన్ క్లాసు.. లైవ్‌లో విద్యార్థి సెక్స్.. షాకైన టీచర్, తోటి విద్యార్థులు

  "88.5 శాతం కేసుల్లో సెక్స్‌లో పాల్గొన్న వారికి పురుషాంగం ముందు భాగంలో గాయాలు లేదా ఫ్రాక్చర్లు అవుతుంటాయి. ఒక్కోసారి హస్త ప్రయోగం (masturbation) చేసినప్పుడు కూడా అంగం ముక్కలవుతుంది. కొన్ని సందర్భాల్లో పురుషాంగాన్ని బలంవంతంగా వంచుతారు... ఎక్కువగా మధ్య ఆసియా దేశాల్లో ఇలా చేస్తారు. ఇలాంటి సందర్భంలో కూడా అంగానికి గాయాలవుతాయి" అని డాక్టర్లు తెలిపారు.
  Published by:Krishna Kumar N
  First published: