• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • BRITAIN WOMAN CLAIMS SHE HAS BEEN ABDUCTED BY SILVER COLOURED ALIENS OVER 50 TIMES HERE IS HER FULL STORY NK

Alien abduction: నన్ను ఏలియన్స్ ఎత్తుకెళ్లారు... బ్రిటన్ మహిళ సంచలన ప్రకటన

Alien abduction: నన్ను ఏలియన్స్ ఎత్తుకెళ్లారు... బ్రిటన్ మహిళ సంచలన ప్రకటన

నన్ను ఏలియన్స్ ఎత్తుకెళ్లారు... బ్రిటన్ మహిళ సంచలన ప్రకటన (ప్రతీకాత్మక చిత్రం)

Alien abduction: గ్రహాంతర వాసులు మనుషుల్ని ఎత్తుకుపోవడం అన్నది ఏళ్లుగా జరుగుతున్న చర్చ. దీనిపై సినిమాలూ వచ్చాయి. మరి ఆమె విషయంలో ఏం జరిగిందో తెలుసుకుందాం.

  • Share this:
    Alien abduction: మన ఇండియాలో తక్కువే గానీ... విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ప్రజలు ఏలియన్స్‌ని బాగా నమ్ముతారు. గ్రహాంతరవాసులు ఎగిరే పళ్లాలలో (అవి వారి విమానాలు - UFOలు) వచ్చి... మనుషులు లేదా ఆవుల్ని ఎత్తుకుపోతారని బాగా నమ్ముతారు. ఇదే అంశంపై 1970 నుంచి వరుస పెట్టి సినిమాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా బ్రిటన్‌కి చెందిన ఓ మహిళ... తనను ఏలియన్స్ 50 సార్లకు పైగా ఎత్తుకెళ్లారని చెప్పింది. దాంతో... ఆమె నిజం చెబుతోందా... నాటకాలు ఆడుతోందా అనే డౌట్ తెరపైకి వచ్చింది. ఒకట్రెండు సార్లు ఎత్తుకెళ్లారంటే నమ్మొచ్చేమో గానీ... ఏకంగా 50 సార్లు అంటుంటే... నమ్మలేకపోతున్నారు. ఆమె ఏమందో మరింత వివరంగా తెలుసుకుందాం.

    అసలు గ్రహాంతరవాసులు ఉన్నారా అనేది ఆన్సర్ లేని ప్రశ్న. వారు ఎగిరే పళ్లాలలో వస్తున్నారా అనేది మరో ప్రశ్న. వారు మనుషుల్ని ఎత్తుకెళ్తున్నారా అనేది ఇంకో ప్రశ్న. వేటికీ ఆధారాలు లేవు. చాలా మంది రోజూ వేర్వేరు దేశాల్లో తాము ఆకాశంలో వింత వస్తువుల్ని (UFO)లను చూశాం అంటారు.... వీడియోలూ చూపిస్తారు. కానీ అవేవీ స్పష్టంగా ఉండవు. దాంతో మనం నమ్మలేం. ఈ మహిళ చెప్పేది కూడా అలాగే ఉంది.


    డైలీ స్టార్ రిపోర్ట్ ప్రకారం... పాలా స్మిత్ (paula smith) వయసు 50 ఏళ్లు. బ్రాడ్‌ఫోర్టులో ఉంటోంది. చిన్నప్పుడు మొదటిసారి ఏలియన్స్ ఎత్తుకెళ్లారట. ఆ తర్వాత నుంచి అలా ఎత్తుకెళ్తూనే ఉన్నారని చెప్పింది. ఇలా ఎత్తుకెళ్లినప్పుడల్లా... తన ఒంటిపై గాయాలు (bruises) పెడుతున్నారని ఆమె అంటోంది. సరే... ఇది నిజమే అనుకుందాం కాసేపు. మరి ఏలియన్స్ ఏ రంగులో ఉంటారు అని అడిగితే... సిల్వర్ (వెండి రంగు) కలర్ అని చెబుతోంది. ఆమె కొన్ని ఫొటోలు కూడా చూపించింది. వాటిలో చిత్రమైన జీవులు ఉన్నాయి. అవే ఏలియన్స్ అని ఆమె చెబుతోంది. ఆ ఫొటోలు స్పేస్‌షిప్ (వ్యోమ నౌక)లో తీసినవి అని చెబుతోంది.

    "52 సార్లు ఎత్తుకెళ్లారు. ఏ వార్నింగ్‌లూ ఇవ్వట్లేదు. అలా జరుగుతోంది అంతే" అని పాలా తెలిపింది. "నేను UFOలో ఉంటున్నా... నాకు అలా అనిపించట్లేదు" అని చెప్పింది. మాటిమాటికీ ఎత్తుకెళ్తుంటే... ఇక భయపడటం మానేసి... ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాను అంటోంది. అంతే కాదు... తన చుట్టూ ఉన్న ప్రజలు మంచి వాళ్లు కాదనీ... తన మాటల్ని నమ్మట్లేదని అంటోంది. అఫ్‌కోర్స్ మనమూ నమ్మలేకపోతున్నాం కదా.

    ఇది కూడా చదవండి: Horoscope 12-5-2021: ఈ రాశుల వారికి ఆర్థికంగా, ఆస్తి పరంగా మంచి ఫలితాలు

    గతంలో కంటే కరోనా కాలంలో... ఎక్కువ మంది తాము UFOలని చూశామని చెబుతున్నారట. గత నెల్లో 480 రిపోర్టులు ఇలాంటివి వచ్చాయని బ్రిటన్‌ లోని నేషనల్ UFO రిపోర్టింగ్ సెంటర్ తెలిపింది.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు