UK Covid 19 : వామ్మో ఇంత డ‌బ్బా.. క‌రోనా క‌ట్ట‌డికి బ్రిట‌న్ పెట్టిన ఖ‌ర్చెంతో తెలుసా..

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కార‌ణంగా ప్ర‌తీ దేశం న‌ష్ట‌పోయింది. ప్ర‌తీ దేశం ఆర్థికంగా ఎంతో న‌ష్ట‌పోయింది. ప్ర‌పంచ‌లోనే పెద్ద దేశంలో ఒక్క‌టైన బ్రిట‌న్ (Britain) క‌ర‌నా క‌ట్ట‌డికి ఎంత ఖ‌ర్చు చేసిందో అంద‌రికీ ఆస‌క్తి ఉంటుంది. దీంతో ప‌బ్లిక్ ఎకౌంట్స్ క‌మిటీ ఈ ఖ‌ర్చుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

  • Share this:
    ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కార‌ణంగా ప్ర‌తీ దేశం న‌ష్ట‌పోయింది. ప్ర‌తీ దేశం ఆర్థికంగా ఎంతో న‌ష్ట‌పోయింది. ప్ర‌పంచ‌లోనే పెద్ద దేశంలో ఒక్క‌టైన బ్రిట‌న్ (Britain) క‌ర‌నా క‌ట్ట‌డికి ఎంత ఖ‌ర్చు చేసిందో అంద‌రికీ ఆస‌క్తి ఉంటుంది. బ్రిట‌న్ ముఖ్యంగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు, ట్రేసింగ్‌, చికిత్స కోసం భారీ ఎత్తున ఖర్చు పెడుతున్నాయి. ఇందులో భాగం గా బ్రిటన్‌ ప్రభుత్వం దాదాపు 37 బిలియన్ పౌండ్ల అంటే భార‌తీయ క‌రెన్సీ ప్ర‌కారం రూ.3ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేసింది. గతేడాది కొవిడ్‌ మహమ్మా రి (Covid 19 Pandemic) విజృంభణ మొదలైన సందర్భంలో కేసులను గుర్తింపు, ట్రేసింగ్ కోసం భారీ కార్యక్రమాన్ని చేపట్టిన బ్రిటన్‌ ప్రభుత్వం.. ఇందు కోసం ప్రభుత్వ ఆరోగ్య సేవలను వినియోగించుకోకుండా ప్రైవేటు కాంట్రాక్టర్ల (Contractors) పై ఆధార‌ప‌డింది. దీంతో ఖ‌ర్చు త‌డిసి మోప‌డైంద‌ని ప‌బ్లిక్ ఎకౌంట్స్ క‌మిటీ పేర్కొంది.

    కొర‌వ‌డిన ప్రణాళిక‌..
    కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందు కోసం దాదాపు 37 బిలియన్‌ పౌండ్లు (51 బిలియన్‌ డాలర్లు) ఖర్చు పెట్టింది. వీటి ఫలితాలను అంనా వేసేందుకు అక్క డి హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌కు చెందిన ప‌బ్లిక్ ఎకౌంట్స్ క‌మిటీ ఓ నివేదికను అందించింది.

    Brazil : బ్రెజిల్ అధ్య‌క్షుడిపైనే విచార‌ణ‌.. క‌రోనా క‌ట్ట‌డిలో విఫ‌ల‌మే కార‌ణం!


    ప్ర‌భుత్వం క‌ట్ట‌డికి ముందు చూపు లేకుండా అత్యుత్సాహంతో కోవిడ్ ప‌రీక్ష‌ల విష‌యంలో ఖ‌ర్చు ఎక్కువ పెట్టార‌ని క‌మిటీ అభిప్రాయ ప‌డింది. విడ్‌ పరీక్షలు, ట్రేసింగ్ కోసం పెట్టిన భారీ ఖర్చు వృథా అయ్యిందని కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. కళ్లు చెదిరేంత ప్రజాధనం ఇలా వృథా కావడం ఆందోళన కలిగిస్తోందని క‌మిటీ పేర్కొంది. ప్రభుత్వా నికి శ్రద్ధ లేకపోయిందని మండిపడ్డారు.

    చ‌ర్య స‌రైందేన‌న్న ప్ర‌భుత్వం..
    బ్రిటన్‌ ప్రభుత్వం మాత్రం తమ టెస్టింగ్ కార్యక్రమాన్ని సమర్థించుకుంది. యూరోపియన్‌ దేశాల్లో ఎక్క డాలేని విధంగా ఎక్కు వ మం ది బ్రిటన్‌ ప్రజలు కొవిడ్‌ టెస్టులు చేయిం చుకున్న ట్లు తెలిపింది. ప్రజల ప్రాణాలను కాపాడడం, కొవిడ్‌ వ్యా ప్తి గొలుసును విచ్ఛిన్నంచేయడంతోపాటు క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌య‌త్నం చేయ‌డం త‌ప్పుకాద‌ని ప్ర‌భుత్వం పేర్కొంది.
    Published by:Sharath Chandra
    First published: