హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Queen Elizabeth II: బ్రిటన్​ రాణి బ్రతికుండగానే అంత్యక్రియలకు ప్రణాళిక.. పేపర్స్​ లీక్​ అవడంతో గందరగోళం

Queen Elizabeth II: బ్రిటన్​ రాణి బ్రతికుండగానే అంత్యక్రియలకు ప్రణాళిక.. పేపర్స్​ లీక్​ అవడంతో గందరగోళం

క్వీన్​ ఎలిజబెత్​ (ఫైల్​)

క్వీన్​ ఎలిజబెత్​ (ఫైల్​)

బ్రిటన్​ రాణి ఎలిజబెత్​ బతికుండగానే ఆమె మరణించిన తర్వాత ఏమేం చేయాలో ప్రణాళిక(plan) రూపొందించుకున్నారట. పది రోజుల పాటు రాణి గారి మృతదేహాన్ని ఖననం(buried) చేయకుండా ఉంచుతారట. రాణి గారు చనిపోతే ముందుగా ఎవరికి చెప్పాలి అనేది కూడా ఆ ప్రణాళికలో రాశారంట. దీనికి సంబంధించిన పేపర్స్​ Politico అనే వెబ్​సైట్​ చేతికి దొరకడంతో విషయం బయటపడింది.. ఇంతకీ ఆ లీకైన పేపర్స్​లో ఏం ఉందో ఓ సారి తెలుసుకుందాం

ఇంకా చదవండి ...

  పూర్వకాలంలో రాజులు(king), రాణీ(queen)ల వ్యవస్థ ఉండేది. కాలక్రమేణా అది అంతరించిపోయింది. రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. ఎలక్షన్లు వచ్చాయి. తమకిష్టమైన వ్యక్తులనే నాయకులుగా ఎన్నుకుంటున్నారు ప్రజలు. అయితే కొన్ని దేశాల్లో ఇప్పటికీ రాజరిక వ్యవస్థ ఉంది. మరికొన్ని దేశాల్లో అందరిలాగే ఎన్నికల ద్వారా దేశ ప్రధాని, అధ్యక్షులను ఎన్నుకున్నా.. రాణులు, రాజులు, రాజకుమారులు(prince) ఉన్నారు. వారి వైభవం ఎప్పటికీ అలాగే ఉంటుంది. పరిపాలన మాత్రం ప్రజలచేత ఎన్నుకోబడిన నాయకులే చేస్తారు. ఇలాంటి చరిత్రే ప్రస్తుతం బ్రిటన్(Britain)​లో నడుస్తోంది. అక్కడ రాణి ఎలిజబెత్​‌‌ II (Queen Elizabeth) ఉన్నారు. బంకింగ్​హమ్​ ప్యాలెస్ (Buckingham palace)​లో ఉంటారు. ఈ రాణి గారి విషయం ఇప్పుడెందుకు తెలుసుకుంటున్నామంటే.. రాణి గారు బతికుండగానే ఆమె మరణించిన తర్వాత ఏమేం చేయాలో ప్రణాళిక(plan) రూపొందించుకున్నారట. పది రోజుల(days) పాటు రాణి గారి మృతదేహాన్ని ఖననం(buried) చేయకుండా ఉంచుతారట. రాణి గారు చనిపోతే ముందుగా ఎవరికి చెప్పాలి అనేది కూడా ఆ ప్రణాళికలో రాశారంట. దీనికి సంబంధించిన పేపర్స్​ Politico అనే వెబ్​సైట్​ చేతికి దొరకడంతో విషయం బయటపడింది.. ఇంతకీ ఆ లీకైన పేపర్స్​లో ఏం ఉందో ఓ సారి తెలుసుకుందాం..

  ఈ‌ 95 ఏళ్ల రాణి బ్రిటిష్ చరిత్రలోనే అతి పెద్ద రాణి . లీకైన డాక్యుమెంట్స్ ప్రకారం.. రాణి ఎలిజబెత్ II మరణం తరువాత మొదటి సమాచారం దేశ ప్రధాని(prime minister)కి అందిస్తారు. ఆ సమాచారం కూడా రాణి ఎలిజబెత్​ వ్యక్తిగత కార్యదర్శి(private secretary) అందిస్తారు. అనంతరం ఆ విషయం కేబినేట్​ మంత్రులకు, ఇతర ప్రముఖులకు తెలుస్తుంది. అంతేకాకుండా రాణి మరణం గురించి మొదటి మాట్లాడేది దేశ ప్రధాని మాత్రమే. ఆ తర్వాతే మంత్రులు, ఇతరులు స్పందించాలి. ఇక ఆమె మృతదేహాన్ని మూడు రోజుల పాటు పార్లమెంటు (parliament)లో ఉంచుతారు. ఈ సమయంలో లక్షలాది మంది ప్రజలు లండన్‌(London)కు చేరుకోవచ్చు. అయితే ఆ సమయంలో అక్కడ ఆహార కొరత(food shortage) ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రణాళికకు 'ఆపరేషన్ లండన్ బ్రిడ్జ్(operation London bridge)' అని పేరు పెట్టారు..

  10 రోజుల తర్వాతే ఖననం..

  ఆమె మరణించిన 10 రోజుల తర్వాత ఆమెని సమాధి చేయనున్నారు. ఆమె కుమారుడు, వారసుడు ప్రిన్స్ చార్లెస్(Charles)  రాణి ఎలిజబెత్ II అంత్యక్రియలకు ముందు దేశవ్యాప్తంగా(nationwide) పర్యటిస్తారు.. అంత్యక్రియల సమయంలో  రద్దీ అలాగే గందరగోళాన్ని ఎదుర్కోవడానికి విస్తృతమైన భద్రతా ఆపరేషన్ ప్లాన్ చేశారు. క్వీన్ అంత్యక్రియల రోజున జాతీయ సంతాపం దినం ఉంటుంది. ఆమె మృతికి సంతాపంగా దేశవ్యాప్తంగా ఒక నిమిషం పాటు మౌనం సైతం పాటించనున్నారు. అయితే రాణి తూర్పు ఇంగ్లాండ్‌లోని నార్‌ఫోక్‌లోని ఆమె నివాసమైన సాండ్రింగ్‌హామ్‌లో మరణిస్తే, ఆమె మృతదేహాన్ని రాయల్ రైలు(royal rail)లో లండన్‌లోని సెయింట్ పాంక్రాస్ స్టేషన్‌కు తీసుకువెళతారు, అక్కడ ఆమె శవపేటికను రిసీవ్​ చేసుకోవడానికి ప్రధాని, కేబినెట్ మంత్రులు వెళతారు. ఒకవేళ ఆమె స్కాట్లాండ్‌లోని బాల్‌మోరల్‌లో మరణిస్తే, ఆపరేషన్ యునికార్న్ యాక్టీవ్​ చేయబడుతుంది. వీలైతే ఆమె మృతదేహాన్ని రాయల్ రైలు ద్వారా లండన్‌కు తీసుకెళతారు. లేకపోతే ఆపరేషన్ ఓవర్‌ స్టడీ ప్రారంభించబడుతుంది, అంటే శవపేటిక విమానం ద్వారా తరలిస్తారు. ఈ విషయాలన్నీ లీకైన పేపర్స్​లో ఉన్నాయంటూ ప్రముఖ వెబ్​సైట్​​ Politico తన కథనంలో పేర్కొంది. అయితే పేపర్స్​ లీకేజీపై విచారణ జరుగుతోందని తెలుస్తోంది. దీనిపై బంకింగ్​హామ్​ ప్యాలెస్ ​నుంచి ఎటువంటి సమాచారం రాకపోయినా రాయల్ ​ఫ్యామిలీ ​(royal family)లో మాత్రం లీకేజీపై ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే పేపర్స్​ లీక్(papers leak)​ చేయడంపై పలువురు ప్రముఖులు సైతం అసంతృప్తి వ్యక్తంచేశారు.

  బ్రిటన్​(Britain)కు ప్రధాని బోరిస్(Boris)​. అయితే అధికారికంగా ప్రభుత్వాధినేత్రి మాత్రం రాణి ఎలిజబెత్​ మాత్రమే. ఆమె పరిపాలనా పరమైన నిర్ణయాలను మాత్రం బహిరంగంగా ప్రధానితో చర్చించరు. సలహాలు మాత్రం ఇస్తుంటారు. అయితే బిల్లు పార్లమెంట్​లో ఆమోదం పొందాక రాణి గారి ఆమోదం తప్పనిసరి. అప్పుడు మాత్రమే అది కార్యరూపం దాలుస్తుంది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Britain, England, London, Persnol photo leaked

  ఉత్తమ కథలు