నెక్ట్స్ మీరే.. ప్రధాని మోదీపై బ్రిటన్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

బీజేపీ నేతల మరణాలపై భోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విపక్షాలు దుష్ట శక్తులను ప్రయోగిస్తున్నాయని అందుకే నేతలు వరసగా చనిపోతున్నారని సాధ్వి పేర్కొన్నారు.

news18-telugu
Updated: August 27, 2019, 8:01 PM IST
నెక్ట్స్ మీరే.. ప్రధాని మోదీపై బ్రిటన్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
నరేంద్ర మోదీ (Image : Twitter)
  • Share this:
ప్రధాని మోదీపై పాకిస్తాన్ సంతతికి చెందిన బ్రిటన్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై విపక్షాలు చేతబడి, వశీకరణం చేస్తోందని..అందుకే ముఖ్య నేతలంతా చనిపోతున్నారని ఎంపీ నజీర్ అహ్మద్ ట్విటర్‌లో కామెంట్స్ చేశాడు. 'తర్వాత మోదీయే'..అంటూ తన బలుపు ప్రదర్శించాడు. అతడి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అతడిని ట్రోల్ చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు.


బీజేపీపై ప్రతిపక్ష పార్టీ ఏదో జాదూ చేస్తోంది. చేతబడులు, వశీకరణ ప్రదర్శిస్తోంది. అందుకే అటల్ బిహారీ వాజ్ పేయి, మనోహర్ పారికర్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ వంటి బీజేపీ నేతలు ఏడాది వ్యవధిలోనే మరణించారు. తర్వాతి నెంబర్ నరేంద్ర మోదీదే.
నజీర్ అహ్మద్
నజీర్ ట్వీట్‌పై కేంద్రమంత్రి రిజుజు వెంటనే స్పందించి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇలాంటి వ్యక్తులు చట్టసభల్లోకి ఎలా ప్రవేశించారో అర్ధం కావడం లేదని మండిపడ్డారు. కాగా, బీజేపీ నేతల మరణాలపై భోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విపక్షాలు దుష్ట శక్తులను ప్రయోగిస్తున్నాయని అందుకే నేతలు వరసగా చనిపోతున్నారని సాధ్వి పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి.
First published: August 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>