Julian Assange: అమెరికాకు షాక్.. అసాంజే అప్పగింతపై బ్రిటన్ కోర్టు ఏమందంటే..

Julian Assange: అమెరికాకు షాక్.. అసాంజే అప్పగింతపై బ్రిటన్ కోర్టు ఏమందంటే..

జూలియన్ అసాంజే

వికీలిక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే తమకు అప్పగించాలని ప్రయత్నిస్తున్న అమెరికాకు షాక్ తగిలింది.

  • Share this:
    వికీలిక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే తమకు అప్పగించాలని ప్రయత్నిస్తున్న అమెరికాకు షాక్ తగిలింది. అసాంజేను విచారణ నిమిత్తం అమెరికాకు అప్పగించేందుకు బ్రిటన్ న్యాయస్థానం నిరాకరించింది. ఈ మేరకు యూకే డిస్ట్రిక్ట్ జడ్జ్ వన్నెసా బరైట్సర్ తన తీర్పును వెల్లడించారు. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజేను అమెరికాకు అప్పగించలేమని సోమవారం ఆయన స్పష్టం చేశారు. అసాంజే క్లినికల్ డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని, ఒకవేళ ఆయనను అమెరికాకు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకునే ప్రమాదం కూడా ఉందని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. ఇక, ఈ విచారణ సందర్భంగా అసాంజేపై గుఢచర్యానికి సంబంధించి 17 కేసులు ఉన్నాయని, కంప్యూటర్ దుర్వినియోగానికి సంబంధించి ఒక కేసు ఉందని యూఎస్ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసుల్లో దోషిగా తేలితే అసాంజేకు 175 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అన్నారు.

    అయితే అసాంజే తరఫు న్యాయవాదులు అమెరికా న్యాయవాదుల వాదనను ఖండించారు. ఒక జర్నలిస్టుగా అమెరికా సైన్యం చేస్తున్న దారుణాలను అసాంజే బయటపెట్టారని అన్నారు. భావ ప్రకటన స్వేచ్చ ద్వారా ఆయన ఆ పని చేశారని చెప్పారు. అయితే అసాంజే న్యాయవాదుల వాదనను న్యాయమూర్తి తిరస్కరించారు. ఈ వ్యవహరంలో నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే.. భావప్రకటన స్వేచ్ఛ కింద ఆయనకు ఎలాంటి రక్షణ ఉండబోదని తేల్చి చెప్పారు. ఇక, అసాంజేను అమెరికాకు అప్పగించేందుకు న్యాయమూర్తి అంగీకరించలేదు.

    అసాంజేను అమెరికాకు అప్పగించేందుకు బ్రిటన్ కోర్టు నిరాకరించడంతో.. ఆయన అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ తీర్పుపై మానవ హక్కుల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసాంజే మద్దతుదారులు వీధుల్లో చేరి ఆయన ఫ్లకార్టులు ప్రదర్శిస్తున్నారు.

    ఇక, 10 ఏళ్ల కిందట అమెరికాకు సైనిక కార్యకలాపాలకు సంబంధించిన కీలక సమాచారం, రహస్య పత్రాలను వికిలీక్స్‌ బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. ఇరాక్‌, అఫ్ఘనిస్థాన్‌ దేశాల్లో అమెరికా యుద్ధనేరాలకు పాల్పడిందని వికీలిక్స్ బయటపెట్టడం తీవ్ర సంచలనం రేపింది. ఇందుకు సంబంధించి విచారణ చేపట్టేందుకు అసాంజేను తమకు అప్పగించాలని అమెరికా కోరుతుంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు