బికినీలో పెళ్లి... బురదలో ముద్దులు... అందరూ చూస్తుండగానే...

రెగ్యులర్‌గా పెళ్లిని చూసి బోర్ కొట్టిందేమో.. ఫ్లోరిడాలో ఓ జంట వింతగా ట్రై చేశారు. అది ఎలా అంటే..

news18-telugu
Updated: April 3, 2019, 7:56 AM IST
బికినీలో పెళ్లి... బురదలో ముద్దులు... అందరూ చూస్తుండగానే...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 3, 2019, 7:56 AM IST
పుర్రెకో బుద్ధి అంటారు.. కొన్ని సంఘటనలు చూస్తే నిజమేననిపిస్తుంది. ఫ్లోరిడాలో జరిగిన ఓ మ్యారేజ్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకు... ఏంటా స్పెషల్ అంటే వీరు అందరిలా మ్యారేజ్ చేసుకోలేదు. మినీ ఆటోలో వెనుకవైపు చిన్న పందిరి వేసి అందులో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో కూడా వీరి బట్టలు ఏంటో తెలుసుకుంటే మతి పోతుంది. పెళ్లికూతురు నిండుగా ఫ్రాక్ వేసుకోలేదు.. బోల్డ్‌గా బికినీ వేసుకుంది. పెళ్లి కొడుకు అయితే షర్టే లేకుండా వచ్చాడు. ఇక పెళ్లికాగానే అంతటితో అయిపోలేదు.. పెళ్లి కూతురిని ఆటో వెనుక నుంచి బురదలోకి తోసేశాడు.. వెంటనే తాను దూకేశాడు.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చూసినవారంతా ఇదేం పెళ్లి అంటూనే షేర్ చేసేస్తున్నారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే ఈ వీడియోకి లక్షల లైక్స్ వచ్చాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..First published: April 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...