హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

BRICS summit: ఈసారి ఇండియాలో బ్రిక్స్ సదస్సు... చైనా ఎందుకు ఒప్పుకుందంటే...

BRICS summit: ఈసారి ఇండియాలో బ్రిక్స్ సదస్సు... చైనా ఎందుకు ఒప్పుకుందంటే...

ఈసారి ఇండియాలో బ్రిక్స్ సదస్సు... చైనా ఎందుకు ఒప్పుకుందంటే... (File image credit - twitter)

ఈసారి ఇండియాలో బ్రిక్స్ సదస్సు... చైనా ఎందుకు ఒప్పుకుందంటే... (File image credit - twitter)

BRICS summit 2021: బ్రిక్స్ సభ్య దేశాల్లో ఒకటైన చైనాకి భారత్‌లో ఈ సదస్సు జరగడం ఇష్టం లేదు. కానీ పక్కా వ్యూహంతోనే బీజింగ్ ఇందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆ వ్యూహం ఏంటి?

BRICS summit 2021: G4, G20 లాగానే... అభివృద్ధి చెందుతున్న బలమైన దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కలిసి ఏర్పాటు చేసుకున్నదే బ్రిక్స్ (BRICS) సంస్థ. దీనికి సంబంధించిన సదస్సు ఒక్కో సంవత్సరం ఒక్కో దేశంలో జరుగుతుంది. ఈ సంవత్సరం... రెండో అర్థభాగంలో అది ఇండియాలో జరగనుంది. కాబట్టి ఈ సదస్సుకు ఇండియా నిర్వహణా బాధ్యతలు చేపడుతుంది. సాధారణంగా ఇండియా అంటే పడని చైనా... ఈ సదస్సు ఇండియాలో జరిగేందుకు ఒప్పుకుంది. ఎలా ఒప్పుకున్నారు అని మీడియా అడిగితే... "దీన్ని మేం సమర్థిస్తున్నాం. మేం ఇండియాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సదస్సు ద్వారా... సభ్య దేశాల మధ్య వేర్వేరు రంగాల్లో సమాచార, సహకారం లభిస్తుంది." అని చైనా విదేశాంగ శాఖ ప్రతనిధి వాంగ్ వెన్బిన్ సోమవారం తెలిపారు. ఈ డైలాగ్‌ని ఇండియన్ మీడియా బాగా గుర్తుంచుకుంటోంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల పరిస్థితులు బాలేవు. అందువల్ల బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సత్సంబంధాలు బలంగా ఉండకపోతే... తమ దేశ విదేశీ వ్యాపారం దెబ్బ తినగలదని చైనా భావిస్తోంది. పైగా బ్రిక్ దేశాలు ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ ఉన్న దేశాలు. ఈ దేశాలతో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల చైనాకు ఆర్థికంగా, వాణిజ్య పరంగా ఎన్నో లాభాలు ఉంటాయి. అందుకే ఓవైపు సరిహద్దుల్లో ఘర్షణాత్మక వాతావరణం ఉన్నా... చైనా భారత్‌తో దోస్తీకి వెంపర్లాడుతోంది. ఇందులో చైనా స్వార్థం చాలా ఉంది. సరిహద్దుల్లో గొడవలు ఉన్నాయని ఇండియాకి దూరమైతే... దాని వల్ల చైనా ఆర్థికంగా చాలా నష్టపోతుంది. ఆ దేశానికి ఇండియాలో పెద్ద ఎత్తున బిజినెస్ నడుస్తోంది. ఇండియాతో గొడవ పెట్టుకుంటే... అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బతిని... చైనాలో వస్తు తయారీ కంపెనీలు తీవ్రంగా నష్టపోతాయి.

గత 20 ఏళ్లలో బ్రిక్స్ సంస్థలో చైనా యాక్టివ్‌గానే ఉంది. అలాగని అన్ని సభ్య దేశాలకూ మేలు జరిగేలా చైనా చేసిందేమీ లేదు. తన విదేశీ వాణిజ్యాన్ని పెంచుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డింది. ఇప్పుడు కరోనా కాలం కాబట్టి... చైనాలో పరిస్థితులు అస్సలు బాలేవు. ఆర్థికంగా ఆ దేశంలో జోరు తగ్గింది. అందుకే భారత్ లాంటి దేశాలకు దూరమయ్యేందుకు సిద్ధంగా లేదు. అలాగని ముల్లు లాంటి చైనాను నెత్తిన పెట్టుకోలేమన్నది నిజం.

నిజానికి సరిహద్దు సమస్య అనేది సమస్యే కాదు. చైనాకి ఇండియా కంటే రెట్టింపు భూభాగం ఉంది. అందులో మూడో వంతును మాత్రమే చైనా వాడుకోగలుగుతోంది. మిగతా భామి అంతా వృధాగానే ఉంది. అందువల్ల చైనా నిజంగా భూమిని ఉపయోగించుకోవాలనుకుంటే... తన భూమిలోనే అన్నీ చేసుకోవచ్చు. కానీ కుటిల చైనాకు ఎంత భూమి ఉన్నా ఆశ చావట్లేదు. ఇంకా ఇంకా ఆక్రమించాలని సినిమాల్లో విలన్‌లా మారుతోంది. కొన్నేళ్లుగా ఇండియా స్థిరమైన అభివృద్ధి సాధిస్తుండటాన్ని తట్టుకోలేకపోతున్న డ్రాగన్... రకరకాల కుట్రలు పన్నుతోంది.

ఇది కూడా చదవండి: Coconut: కొబ్బరి బోండాంలో లేత కొబ్బరి తింటున్నారా... ఈ ప్రయోజనాలు మీకే

2020లో బ్రిక్స్ దేశాలన్నీ కలిసి... కరోనా వ్యాక్సిన్ల విషయంలో సహకరించుకుంటూ ముందుకెళ్లాలని అనుకున్నాయి. ఇండియా ఆ మాటపై నిలబడింది. చాలా దేశాలకు వ్యాక్సిన్లను పంపింది. అదే విధంగా ఇప్పుడు కూడా ఇండియా చైనాతో సానుకూలంగా ఉండేందుకే ప్రయత్నిస్తోంది. బీజింగ్ మాత్రం... తన స్వార్థమే చూసుకుంటూ... నాటకాలు ఆడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను ఎదురు తిరిగితే తనకే నష్టమని తెలుసుకున్న చైనా పైకి నవ్వుతూ తెరవెనక కుయుక్తులు పన్నుతోంది. బ్రిక్స్ సదస్సు ఇండియాలో జరగనుండటాన్ని చైనా స్వాగతించడం వెనక కూడా ఇలాంటి కుట్రే దాగి ఉంది. వేరే గత్యంతరం లేకే డ్రాగన్... ఇండియాతో కలిసి సాగాలనుకుంటోంది. ఈ సదస్సు ఏమాత్రం సరిగా సాగకపోయినా... దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ఇండియాపై విమర్శలు చేయడానికి డ్రాగన్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

First published:

Tags: India-China

ఉత్తమ కథలు