హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Honey bees: అక్కడ కోటిన్నర తేనెటీగలను సీజ్ చేసి తగులబెట్టనున్నారు.. ఎందుకంటే..

Honey bees: అక్కడ కోటిన్నర తేనెటీగలను సీజ్ చేసి తగులబెట్టనున్నారు.. ఎందుకంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వేరే దేశం నుంచి దాదాపు కోటిన్నర చిన్న తేనెటీగలను(Baby bees) ఓ వ్యాపారి దిగుమతి చేసుకుంటున్నాడని గుర్తించిన ఆ దేశ అధికారులు వాటిని కాల్చేస్తామని హెచ్చరించారు. కారణమేంటంటే..

  బ్రిటన్​కు చెందిన ఓ వ్యాపారి దేశంలోకి 15 మిలియన్ల చిన్న తేనెటీగలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇది తెలుసుకున్న అధికారులు వాటిని తీసుకొస్తే వెంటనే సీజ్​ చేసి, మంటల్లో కల్చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందుకోసం హెచ్చరికలు కూడా జారీ చేశారు. బ్రెగ్జిట్​కు తర్వాత తీసుకొచ్చిన ఓ చట్టం ప్రకారం ఇలా చేశారు.

  తన వ్యాపారంతో పాటు బ్రిటన్​లోని కొందరు తేనె రైతుల కోసం బేబీ ఇటాయలిన్ తేనెటీగలను తేనె వ్యాపారి పాట్రిక్ ముర్ఫెట్​ తీసుకురావాలనున్నారు. అయితే బ్రెగ్జిట్ తర్వాత యూకే తేనెటీగలను కొన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకోవడాన్ని నిషేధించింది. ఆ నిబంధనల ప్రకారం బ్రిటన్​లోకి కేవలం క్వీన్ తేనెటీగలను మాత్రమే వేరే దేశాల నుంచి తీసుకురావొచ్చు. కానీ కానీ తేనెతుట్టెలను భారీ సంఖ్యలో దిగుమతి చేసుకునేందుకు వీలు లేదు. నిషేధం నుంచి తప్పించుకునేందుకు ప్రారంభంలో ఉత్తర ఐర్లాండ్​ నుంచి ముర్ఫెట్ తేనెటీగలను దిగుమతి చేసుకొని.. హెచ్చరికలకు గురయ్యాడు. అప్పుడే ధ్వంసం చేస్తామన్న వార్నింగ్​లు వచ్చాయి.

  “నేను ఎంతో ప్యాషన్​తో తేనెటీగలను పెంచుతున్నా. దాదాపు 20 ఏళ్లుగా ఇదే పని చేస్తున్నా. సొంత కాళ్లపై నిలబడి ప్రపంచమంతా తేనెను ఎగుమతి చేయాల్సి ఉండగా ఇలాంటి నిబంధనలు తేలవడం అర్ధరహితం” అని ఆయన చెప్పారు.

  బ్రెగ్జిట్​కు ముందు ముర్ఫెట్ ఇటలీ నుంచి అధిక సంఖ్యలో చాలా సార్లు తేనెటీగలను దిగుమతి చేసుకున్నారు. తాను ఇప్పటికే 20వేల యూరోలు డిపాజిట్ చేశానని, ఆ దేశం నుంచి ఇక తేనెటీగలను తెచ్చుకోలేకుంటే లక్ష యూరోలు నష్టపోతానని ఆవేదన వ్యక్తం చేశారు.

  యూరప్​​లో తేనెటీగలు తగ్గిపోతున్న మూడు దేశాల్లో బ్రిటన్ ఒకటి. దీన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇలా చేయడం వల్ల తేనె ఉత్పత్తి తగ్గుతుంది. దిగుమతి పెరుగుతుంది. లాభాలు తగ్గుతాయి” అని ముర్ఫెట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిబంధనపై స్పష్టత ఇచ్చి, భవిష్యత్తులో తేనెటీగల దిగుమతులను అనుమతించేలా చట్టాలు మార్చాలని కోరారు.

  Published by:Krishna P
  First published:

  Tags: Uk

  ఉత్తమ కథలు