బ్రెగ్జిట్ గడువు దగ్గర పడుతోంది... బ్రిటన్‌లో టెన్షన్ టెన్షన్...

Brexit : యూరప్ దేశాల్ని కుదిపేస్తున్న అంశం బ్రెగ్జిట్. బ్రిటన్ వైదొలగితే ఏం జరుగుతుందన్నదానిపై అందరిలోనూ ఆందోళనలున్నాయి. యూరో కరెన్సీ విలువ, నిరుద్యోగం, శరణార్థుల సమస్యలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం కనిపిస్తోంది.

news18-telugu
Updated: February 4, 2019, 6:37 AM IST
బ్రెగ్జిట్ గడువు దగ్గర పడుతోంది... బ్రిటన్‌లో టెన్షన్ టెన్షన్...
ఎలిజబెత్ 2 (File)
news18-telugu
Updated: February 4, 2019, 6:37 AM IST
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వెళ్లిపోవాలన్నది ఆ దేశంలోని 52 శాతం ప్రజల కోరిక. ఐతే 48 శాతం మంది బ్రిటన్ యూరోపియన్ యూనియన్‌లోనే ఉండాలని కోరుతున్నారు. వెళ్లిపోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, కచ్చితంగా అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఏం చెయ్యాలన్నదానిపై బ్రిటన్ ప్రభుత్వం ఆలోచనలో పడింది. ముందుగా ఇంగ్లండ్‌లో రాజ కుటుంబంలోని రాణి ఎలిజబెత్‌ 2ను, ఆమె భర్తనూ సురక్షితంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. డీల్ ప్రకారం మార్చి 29న 25 దేశాల కూటమి... యూరోపియన్ యూనియన్ నుంచీ బ్రిటన్ వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ బ్రిటన్ ఎగ్జిట్‌నే బ్రెగ్జిట్ అంటున్నారు. బ్రెగ్జిట్ సమయంలో అల్లర్లు జరిగితే... స్కాట్లాండ్ పోలీసుల సాయం కూడా తీసుకోవాలని లండన్ పోలీసులు భావిస్తున్నారు.

brexit, queen elizabeth, britain, queen elizabeth on brexit, elizabeth, great britain, brexit deal, brexit vote, brexit britain and secure trade deals, బ్రిటన్ ఎగ్జిట్, బ్రెగ్జిట్
థెరెసా మే (File)


మార్చిలో ఎట్టి పరిస్థితుల్లో బ్రెగ్జిట్ అమలు చెయ్యాలని బ్రిటన్ ప్రధాని థెరిసా మే డిసైడ్ అయ్యారు. బ్రెగ్జిట్‌కి సంబంధించి కొన్ని సమస్యలున్నాయి. బ్రిటన్ వైదొలగితే... యూరోపియన్ యూనియన్‌లో అప్పులకు సంబంధించి ఇంకా పరిష్కారాలు దొరకలేదు. యూరో కరెన్సీ విలువ పతనం కాకుండా ఏం చర్యలు తీసుకుంటారన్నదానిపై స్పష్టత లేదు. బ్రిటన్‌లో నిరుద్యోగ యువత బ్రెగ్జిట్ వల్ల తాము నష్టపోతామని అంటున్నారు.
ఇక బ్రిటన్‌తో సరిహద్దు దేశాల మధ్య వివాదాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. అందువల్లే బ్రెగ్జిట్ విషయంలో బ్రిటన్ పార్లమెంట్ థెరెసా మే నిర్ణయాన్ని వ్యతిరేకించింది. స్వయంగా ఆమె పార్టీ నేతలే బ్రెగ్టిట్‌ను తప్పుపడుతూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటువేశారు. ఆ తర్వాత జరిగిన విశ్వాస పరీక్షలో మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసి థెరెసా మేను గట్టెక్కించారు.

brexit, queen elizabeth, britain, queen elizabeth on brexit, elizabeth, great britain, brexit deal, brexit vote, brexit britain and secure trade deals, బ్రిటన్ ఎగ్జిట్, బ్రెగ్జిట్
ప్రతీకాత్మక చిత్రం


రెండేళ్లుగా దొరకని పరిష్కారాలు... రెండు నెలల్లో దొరికేస్తాయని అనుకోలేం. థెరెసా మే మాత్రం... గడువు లోగా అన్నీ సెటిల్ చేసి, అందరితోనూ చర్చించి... బ్రెగ్జిట్ అవుతామని చెబుతున్నారు.

Video : ఏపీ తాత్కాలిక హైకోర్టు భవనం డ్రోన్ దృశ్యాలు...
First published: February 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...