హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Marilia Mendonca: మరికాసేపట్లో మ్యూజిక్ కన్సర్ట్.. అంతలోనే ఘోర విమాన ప్రమాదం.. ప్రముఖ సింగర్ మృతి

Marilia Mendonca: మరికాసేపట్లో మ్యూజిక్ కన్సర్ట్.. అంతలోనే ఘోర విమాన ప్రమాదం.. ప్రముఖ సింగర్ మృతి

మారిలియా మెండోంకా

మారిలియా మెండోంకా

Marilia Mendonca: ప్రమాదానికి కొన్ని గంటల ముందు విమానంనుంచే ఆమె ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్తున్న దృశ్యాలు, విమానం లోపల పండు, స్నాక్స్ తింటున్న క్లిప్‌ను అభిమానులతో పంచుకుంది. ఆ తర్వాత కాసేపటికే విమానం కూలిపోయింది కన్నుమూసింది మెండోంకా.

ఇంకా చదవండి ...

బ్రెజిల్‌ (Brazil)లో ఘోర విమాన ప్రమాదం (Plane Crash) జరిగింది. ఈ దుర్ఘటనలో ప్రముఖ సింగర్, లాటిన్ గ్రామీ అవార్డ్ విజేత మారిలియా మెండోంకా  (Marilia Mendonca) మరణించారు. మెండోంకాతో పాటు ఆమె మేనేజర్ హన్రిక్ రిబైరో, సహాయకుడు అబిసిలీ సిల్వేరియా, పైలట్, కోపైలట్ కూడా చనిపోయారు. బ్రెజిల్‌లోని మినాస్ గెరియాస్ స్టేట్‌లో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. మరికాసపట్లో మ్యూజికల్ కన్సర్ట్‌లో అభిమానులను ఉర్రూతలూగించాల్సిన ఆమె.. విమాన ప్రమాదంలో మరణిచడం అందరినీ కలచివేసింది. ఆమె అభిమానులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.26 ఏళ్ల చిన్న వయసులోనే ఆమె మరణించడాన్ని తట్టుకోలేకపోతున్నారు.

మారిలియా మెండోంకా కరాటింగా నగరంలో జరుగుతున్న మ్యూజిక్ కన్సర్ట్‌లో పాల్గొనాల్సి ఉంది. అందుకోసం తమ స్వస్థలమైన గోయానికా నుంచి కరాటింగాకు బయలుదేరారు. తన మేనేజర్, సహాయకులతో కలిసి ప్రైవేట్ జెట్‌లో వెళ్లారు. కాని కాసేపటి తర్వాత విమానం కుప్పకూలింది. ఓ విద్యుత్ లైన్‌ను ఢీకొట్టి నేరుగా కింద పడింది.  కొండ ప్రాంతంలో సెలయేరు వద్ద కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న వారంత మరణించారు. ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు. ఐతే ప్రమాదానికి కొన్ని గంటల ముందు విమానంనుంచే ఆమె ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్తున్న దృశ్యాలు, విమానం లోపల పండు, స్నాక్స్ తింటున్న క్లిప్‌ను అభిమానులతో పంచుకుంది. ఆ తర్వాత కాసేపటికే విమానం కూలిపోయింది కన్నుమూసింది మెండోంకా.

పెంటగాన్ సంచలన నివేదిక.. 2030 నాటికి చైనా వద్ద 1,000 అణు వార్‌హెడ్‌లు ఉండనున్నట్లు వెల్లడి


Yubari Melon: ప్రపంచంలోనే ఖరీదైన పండు.. బంగారం కన్నా ఎక్కువ.. కేజీకి ఎన్ని లక్షలో తెలుసా?

మెండోంకా మృతితో బ్రెజిల్ వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారోతో పాటు రాజకీయ నాయకులు, పలువురు గాయనీ గాయకులు, సాకర్ ఆటగాళ్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. మెండోంకా గొప్ప కళాకారిణి, ఆమె లేని లోటు తీరనిదని బొల్సనారో ట్వీట్ చేశారు.

కాగా, మెండోంకా బ్రెజిలియన్ కంట్రీ మ్యూజిక్ స్టైల్ "సెర్టానెజో" ద్వారా పాపులర్ అయ్యారు. 2019లో రిలీజ్‌ చేసిన ఆల్బమ్‌కు లాటిన్ గ్రామీ అవార్డును ఆమె గెలుచుకున్నారు. గత ఏడాది కోవిడ్-19 కారణంగా బ్రెజిల్‌లో లాక్‌డౌన్ విధించినప్పుడు.. మెండోంకా యూట్యూబ్‌లో ఓ వీడియో లైవ్ టెలికాస్ట్ చేశారు. ఆ వీడియో 3.3 మిలియన్ల వ్యూస్‌తో యూ ట్యూబ్‌లో ప్రపంచ రికార్డు సాధించింది. మండోంకా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 3.95 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమెకు రెండళ్ల కుమారుడు ఉన్నాడు. మెండోంకా ప్రయాణిస్తున్న విమానం ఎలా కుప్పకూలిందన్న వివరాలు తెలియాల్సి ఉంటుంది. ఘటనపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.

First published:

Tags: Brazil, International, International news, Plane Crash

ఉత్తమ కథలు