జైలు నుంచి ఎస్కేప్ కోసం దిమ్మతిరిగే ప్లాన్.. కానీ చివరకు..

2103లో జైల్లో ఓ సొరంగం తవ్వి 27 మంది ఖైదీలతో సిల్వా పారిపోవడం అప్పట్లో పెను సంచలనం.కానీ ఆ తర్వాత నెల రోజులకే అతను మళ్లీ దొరికిపోయాడు. అతనిపై ఉన్న కేసులకు, అతని తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలకు కోర్టు అతనికి 73 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

news18-telugu
Updated: August 7, 2019, 10:57 PM IST
జైలు నుంచి ఎస్కేప్ కోసం దిమ్మతిరిగే ప్లాన్.. కానీ చివరకు..
క్లావినో డా సిల్వా
news18-telugu
Updated: August 7, 2019, 10:57 PM IST
జైలు నుంచి తప్పించుకునేందుకు ఖైదీలు ఎలాంటి ఎత్తులు వేస్తారో మనం సినిమాల్లో చూసి ఉంటాం.కానీ సినిమాలనే తలదన్నే రీతిలో ఓ ఖైదీ జైలు నుంచి బయటపడేందుకు పెద్ద ప్లానే వేశాడు. ఎవరూ గుర్తుపట్టకుండా అచ్చు తన కూతురిలా కనిపించేలా గెటప్ మార్చాడు. కానీ జైలు సిబ్బంది మామూలోళ్లు కాదు కదా.. సదరు ఖైదీ వేషాలను వారు ఇట్టే పట్టేశారు. ఇంకేముంది.. మళ్లీ జైల్లో తోసేశారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఈ ఘటన జరిగిన కొద్దిరోజులకే అతను ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. బ్రెజిల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

బ్రెజిల్ మీడియా కథనం ప్రకారం.. క్లావినో డా సిల్వా అనే గ్యాంగ్ స్టర్ డ్రగ్స్ కేసులో అరెస్టయి రియో జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. గతంలో పలుమార్లు జైలు నుంచి తప్పించుకునేందుకు విఫల ప్రయత్నాలు చేశాడు.2103లో జైల్లో ఓ సొరంగం తవ్వి 27 మంది ఖైదీలతో సిల్వా పారిపోవడం అప్పట్లో పెను సంచలనం.కానీ ఆ తర్వాత నెల రోజులకే అతను మళ్లీ దొరికిపోయాడు. అతనిపై ఉన్న కేసులకు, అతని తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలకు కోర్టు అతనికి 73 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఎలాగైనా జైలు నుంచి తప్పించుకోవాలని ఎప్పుడూ అదే ఆలోచనలో ఉండేవాడు. ఇదే క్రమంలో తప్పించుకోవడానికి మరో ప్లాన్ వేసిన సిల్వా మరోసారి అడ్డంగా దొరికిపోయాడు.

తన 19 ఏళ్ల కుమార్తె ఇటీవల సిల్వాను చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి జైలుకు వచ్చింది. జైలులో ఉన్న ఓ గదిలో సిల్వా వారితో మాట్లాడాడు. కాసేపటికి కూతురి గెటప్‌లో బయటకొచ్చాడు. సిలికాన్ మాస్క్ ధరించి.. కూతురి లాంటి దుస్తులే వేసుకుని వచ్చాడు. అచ్చు కూతురి లాగే ఉండటంతో.. ఎవరూ గుర్తుపట్టరని.. ఈజీగా తప్పించుకోవచ్చునని అనుకున్నాడు.కానీ అలా జరగలేదు. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పట్టేశారు. గట్టిగా ప్రశ్నించేసరికి.. సిల్వా అసలు వేషం బయటపెట్టక తప్పలేదు.అయితే ఈ ఘటన జరిగిన కొద్దిరోజులకే అతను జైల్లో ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. అతని ఆత్మహత్యకు సంబంధించి కారణాలేవి బయటకు రాలేదు. 73ఏళ్ల కారాగార శిక్ష పడటం.. తప్పించుకునే వీలు లేకపోవడంతోనే అతను ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని అంటున్నారు.First published: August 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...