• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • BRAZIL YOUTH PLACES LADY DOLL ON THE SAO PAULO BEACH TO PROTEST AGAINST COVID 19 SHUTDOWN GETS ARRESTED BY POLICE WATCH VIDEO NK

Viral Video: అమ్మాయి బొమ్మతో పోలీసులకు షాక్ ఇచ్చాడు... వాళ్లు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు

Viral Video: అమ్మాయి బొమ్మతో పోలీసులకు షాక్ ఇచ్చాడు... వాళ్లు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు

అమ్మాయి బొమ్మతో పోలీసులకు షాక్ ఇచ్చాడు... వాళ్లు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు (image credit - youtube)

Viral Video: ప్రభుత్వాలు, పోలీసులు కరోనా కారణంగా కఠినంగా వ్యవహరిస్తుంటే... ప్రజల్లో కొందరు తట్టుకోలేకపోతున్నారు. అలాంటి ఓ కుర్రాడు చేసిన తుంటరిపని ఏంటో తెలుసుకుందాం.

  • Share this:
    Viral Video: దక్షిణాఫ్రికా దేశం బ్రెజిల్... మన ఇండియా కంటే డబుల్ సైజు పెద్దగా ఉంటుంది. అది కూడా అభివృద్ధి చెందుతున్న దేశమే. జనభా ఎక్కువే. ఫలితంగా కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ కరోనా కేసులు నమోదైన దేశాల్లో బ్రెజిల్ మూడోదిగా ఉంది. ఈ పరిస్థితుల్లో అక్కడ కూడా లాక్‌డౌన్లు, కర్ఫ్యూలు, నిషేధాజ్ఞల వంటివి చాలా ఉన్నాయి. ఆల్రెడీ ఏడాది పాటూ ఇలాంటి వాటిని భరించిన ప్రజలు... ఇంకా వాటిని ఫాలో అవ్వమంటే తట్టుకోలేకపోతున్నారు. తమ నిరసన తెలిపేందుకు రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. అయితే... ఓ వ్యక్తి... అందరికీ నవ్వు వచ్చేలా నిరసన తెలిపాడు. అతను చేసిన తుంటరిపని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

    ఇప్పుడు బ్రెజిల్‌లోని సావోపాలో బీచ్‌లోకి ప్రజలు వెళ్లేందుకు అనుమతి లేదు. పోలీసులు రౌండ్స్ వేస్తూ... బీచ్ వైపు వెళ్లే ప్రజలకు ఫైన్ వేస్తున్నారు. దీనిపై చిరాకొచ్చిన 29 ఏళ్ల యువకుడు... ఓ మహిళ బొమ్మను బీచ్‌ దగ్గర ఉంచాడు. తద్వారా పోలీసులకు జర్క్ ఇవ్వాలని అనుకున్నాడు. ఆ బొమ్మ అచ్చం... నిజమైన అమ్మాయిలాగే ఉంది. ఎత్తుగానే ఉంది. దూరం నుంచి ఆ బొమ్మను చూసిన పోలీసులు... ఎవరో యువతి... బీచ్ దగ్గరకు వచ్చిందని అనుకొని... వ్యాన్‌లో దగ్గరకు వెళ్లారు. తీరా చూస్తే అది బొమ్మ అని తెలిసి... ఎవరో ఝలక్ ఇవ్వడానికే ఇలా చేశారని భావించారు. తర్వాత... ఆ బొమ్మను ఏం చెయ్యకుండానే... అక్కడి నుంచి వ్యానులో వెళ్లిపోయారు. అందుకు సంబంధించిన వీడియో మీరూ చూడండి.

    పోలీసులను ఆటపట్టించిన ఆకతాయి ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మాకే జర్క్ ఇస్తాడా... వాడి సంగతి తేల్చాల్సిందే అనుకున్న పోలీసులు... నిఘా పెట్టారు. అక్కడికి దగ్గర్లోనే ఉన్న సర్వేలెన్స్ (CCTV) ఫుటేజ్ చెక్ చేశారు. బొమ్మను అక్కడ ఉంచిన వ్యక్తి... కాస్త దూరంగా వెళ్లి... ఓ చెట్టుచాటు నుంచి పోలీసులు రావడాన్ని గమనించిన విషయం ఫుటేజ్ ద్వారా తెలిసింది. అలా అతను ఎవరో కనిపెట్టిన పోలీసులు... పట్టుకొని అరెస్టు చేశారు.

    ఇది కూడా చదవండి: Wolf Air Mask: వోల్ఫ్ ఎయిర్ మాస్క్... గాలిలో కరోనా ఖతం?... సినిమా హాళ్లకు హ్యాపీ?

    నిజానికి అతనిపై పోలీసులకు ఏ కక్షా, ప్రతీకారమూ లేదు. కాకపోతే... బ్రెజిల్‌లో కరోనాతో మూడున్నర లక్షల మందికి పైగా చనిపోయారు. అందువల్ల కరోనా రూల్స్ కఠినంగా అమలుచేస్తున్నారు. అలాంటి సందర్భంలో... ఇలా జోక్స్, ప్రాంక్స్ చేయడం కరెక్టు కాదన్నది పోలీసుల అభిప్రాయంగా తెలిసింది. అతని చర్యపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సపోర్ట్ చేస్తుంటే... కొందరు అది తప్పే అంటున్నారు. మరికొందరు... లైట్ తీసుకోవడమే అంటున్నారు. మొత్తానికి వీడియో మాత్రం వైరల్ అయ్యింది.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు