ఇక భారతీయులు ఆ దేశంలో పర్యటించాలంటే వీసా అక్కర్లేదు

No Visa for Brazil : భారత్, బ్రెజిల్ మధ్య సత్సంబంధాలు మరింత బలపడ్డాయి. ఇక ఆ దేశంలో పర్యటించేందుకు వెళ్లే భారతీయులకు వీసా సమస్యలు లేనట్లే.

news18-telugu
Updated: October 25, 2019, 12:22 PM IST
ఇక భారతీయులు ఆ దేశంలో పర్యటించాలంటే వీసా అక్కర్లేదు
ఇక భారతీయులు ఆ దేశంలో పర్యటించాలంటే వీసా అక్కర్లేదు
  • Share this:
No Visa for Brazil : దక్షిణ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్ ప్రత్యేకమైనది. అతిపెద్ద అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, అతి పెద్ద అమెజాన్ నది... ఈ దేశం సొంతం. ఇక కోకో తోటలకు కూడా ఈ దేశం ప్రసిద్ధి చెందినది. ఇలా చెప్పుకుంటూ పోతే బ్రెజిల్‌కి చాలా ప్రత్యేకతలున్నాయి. అక్కడకు చాలా మంది సినీ ప్రముఖులు, భారతీయులు వెళ్తుంటారు. ఇలా ఆ దేశంతో భారత్‌కి సత్సంబంధాలున్నాయి. వాటిని మరింత పెంపొందిస్తూ... బ్రెజిల్ ప్రభుత్వం... భారతీయులకు ఇకపై వీసాను రద్దుచేసింది. ఈ ఏడాది ఆరంభంలో అధికారంలోకి వచ్చిన బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారో... తమ దేశానికి వచ్చే చాలా సంపన్న దేశాల్లో ప్రజలకు వీసా నిబంధనను తొలగించారు. తాజాగా ఆయన అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాలకు కూడా వీసా రూల్‌ని తప్పించారు.

సాధారణంగా మన దేశం నుంచీ వ్యాపారవేత్తలు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో బ్రెజిల్ వెళ్తున్నారు. ఈ ఏడాది మొదట్లో అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల ప్రజలకు వీసా నిబంధనను తొలగించిన బోల్సొనారో... తాజాగా తీసుకున్న నిర్ణయం భారతీయులకు కలిసొచ్చేదే. ఐతే... సంపన్న దేశాలేవీ బ్రెజిల్ ప్రజలకు వీసా నిబంధనను తొలగించలేదు. మరి భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇప్పుడే చెప్పలేం. ఐతే... ఈ నిర్ణయం మాత్రం... బ్రెజిల్ టూరిజాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. ఆ దేశానికి విదేశీ ఆదాయం మరింత పెరిగే అవకాశాలు మెరుగవుతున్నాయి.

 

మత్తందాలతో చిత్తు చేస్తున్న గురు బ్యూటీ రితికా సింగ్


ఇవి కూడా చదవండి :

ఆశ్చర్యం... ఎలుకల కోసం కార్లు... చక్కగా నడిపేస్తున్నాయిగా
Loading...

ఎద్దుకు కన్నీటి వీడ్కోలు... ఘనంగా అంత్యక్రియలు


Diwali 2019 : దీపావళి వేళ... నగలు ఎలాంటివి వేసుకోవాలంటే...

Diwali 2019 : దీపావళికి ఇంటిని క్లీన్ చేయడమంటే... ఫ్యామిలీతో కాలం గడపడమే

దీపాల వెలుగులో ఫొటోలు దిగుతున్నారా... ఈ చిట్కాలు మీకోసమే
First published: October 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...