BRAZIL SENATORS RECOMMEND INQUIRY ON PRESIDENT KNOW DETAILS EVK
Brazil : బ్రెజిల్ అధ్యక్షుడిపైనే విచారణ.. కరోనా కట్టడిలో విఫలమే కారణం!
బ్రెజిల్ అధ్యక్షుడు
బ్రెజిల్ (Brazil) అధ్యక్షుడిపై ఆ దేశ సెనేట్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకొంది. కరోనాకట్టడిలో విఫలమయ్యాడని ఆరోపణతోపాటు నిధుల దుర్వినియోగం సహా నేరాలను ప్రోత్సహించడం వంటి ఆరోపణలపైనా అధ్య క్షుడిని విచారించాలని ప్రాసిక్యూటర్లకు కమిటీ సిఫార్సు చేసింది.
బ్రెజిల్ (Brazil) అధ్యక్షుడిపై ఆ దేశ సెనేట్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకొంది. కరోనాకట్టడిలో విఫలమయ్యాడని ఆరోపణతోపాటు నిధుల దుర్వినియోగం సహా నేరాలను ప్రోత్సహించడం వంటి ఆరోపణలపైనా అధ్య క్షుడిని విచారించాలని ప్రాసిక్యూటర్లకు కమిటీ సిఫార్సు చేసింది. ప్రపంచ వ్యా ప్తంగా కొవిడ్ మరణాల సంఖ్య అధికంగా ఉన్న దేశాల జాబితాలో బ్రెజిల్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. ఇందుకు ఆ దేశాధ్యక్షుడు జైర్ బోల్సొ నారో నిర్లక్ష్యంతోపాటు తీసుకున్న చర్యలే కారణమం టూ ఎప్పటి నుంచో విమర్శలు వెల్లువెత్తున్నాయి. కొవిడ్ కట్టడిలో బోల్సొ నారో నిర్లక్ష్యం వహించారని.. ఆయనపై చర్య లు తీసుకోవాలం టూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై బ్రెజిల్ సెనేట్ (Brazil Senet) కమిటీ స్పందించింది. మహమ్మారి కట్టడిలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కొద్దిరోజులుగా విచారణ జరిపింది. ఈ క్రమంలోనే అధ్యక్షుడిపై విచారణకు కమిటీ సిఫార్సు చేసింది.
అడుగడుగునా నిర్లక్ష్యం.. కరోనా (Corona) మహమ్మారిని ముందు నుంచీ తక్కువ చేసి చూస్తున్న అధ్య క్షుడు జైర్ బోల్సొనారో.. తమకు టీకాలు కూడా అక్క ర్లేదని కొంత కాలం క్రితం పేర్కొన్నారు. అనంతరం దేశంలో వచ్చిన ప్రజాగ్రహం కారణంగా టీకాలు ఇచ్చేందుకు అంగీకరించారు. అయినా ఆయన మాత్రం టీకా తీసుకోలేదు.
ఇప్పటికీ ఆయన వ్యాక్సిన్ వేసుకోలేదు. నెలల క్రితం ఆయన అమెరికా పర్య టనకు వెళ్లారు. అయితే టీకా ధ్రువపత్రం లేని కారణంగా ఆయనను అక్క డి రెస్టారెంట్లోని (Restaurant) కి రానియ్యలేదు. దీంతో బ్రెజిల్ దేశాధ్యక్షుడై ఉంది. బోల్సె నారో రోడ్డు పక్క నే నిల్చుని పిజ్జా తిన్నారు. దీనిపై అప్పట్లో పలు విమర్శలు కూడా వచ్చాయి. టీకా వేసుకోకపోవడంపై ఆయన తనను తాను సమర్థించుకొనే వారు. రోగనిరోధక శక్తి తనకు ఉందని తనకు టీకా అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
రష్యాలో పెరుగుతున్న కేసులు.. కరోనా (Corona) దెబ్బకు రష్యా విలవిల లాడిపోతుంది. కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతుంది. రష్యాలో రోజుకు 30 వేలకు పైగా కేసులువస్తున్నాయి. అంతే కాకుండా నిత్యం వెయ్యి పైగా మరణాలతో ఆ దేశం అల్లాడిపోతోంది. తాజాగా రికార్డు స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇటీవల 24 గంటల వ్యవధిలో 1,106 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. రష్యా(Russia) లో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పుడు అధికంగా కేసులు వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో పాలు పోని పరిస్థితుల్లో దేశం ఉంది. రష్యాలో ఒక్కరోజే ఇటీవల ఒక్క రోజే 36,446 మందికి వైరస్ (Virus) సోకింది. మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. రష్యాతో పోలిస్తే ఇండియాలో మరణాల నిష్పత్తి తక్కువగా ఉంది. తక్షణమే కరోనా కట్టడికి రష్యాన్ ప్రభుత్వ ఏం చేయాలో ఆలోచనలో పడింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.