Plastic Surgery : కొంతమంది తమ శరీరంలోని కొన్ని భాగాలని, ముఖ్యంగా ముఖాన్ని ఇష్టపడరు, అప్పుడు వారు ప్లాస్టిక్ సర్జరీ(Plastic Surgery) సహాయంతో తమ ముఖాన్ని మెరుగుపరచడానికి లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి రెడీ అవుతారు. చాలా మంది సర్జరీ కోసం విదేశాలకు కూడా వెళ్తుంటారు. సర్జరీ అనేది భోజనం వండడం లాంటి పని కాదు. అందుకు శిక్షణ పొందిన వైద్యులు మాత్రమే అవసరం. బ్రెజిల్ దేశానికి చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్(YouTube) చూసి తానే స్వయంగా సర్జరీ(Surgery) చేసుకున్నాడు. చివరకు హాస్పిటల్ పాలయ్యాడు.
ఈ రోజుల్లో యూట్యూబ్‌లో విభిన్న విషయాల ట్యుటోరియల్‌లు చాలా ప్రసిద్ధి చెందాయి. ప్రజలు కూడా యూట్యూబ్ లో వాటిని చూడటం ద్వారా వంట, క్రాఫ్ట్ సహా అనేక విషయాలను నేర్చుకుంటున్నారు. అయితే బ్రెజిల్‌లోని సావో పాలోకు చెందిన ఒక వ్యక్తి యూట్యూబ్ వీడియోను చూసి తన ముక్కుకు శస్త్రచికిత్స చేసకున్నాడు. ముక్కు సర్జరీ ఎలా చేయాలో యూట్యూబ్ లో ట్యుటోరియల్ చూసిన తర్వాత తన స్వంత ముక్కు ఆపరేషన్ (రైనోప్లాస్టీ) చేసుకున్నాడు. అయితే దాని తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడంతో జూలై 21 ఆ వ్యక్తి పరీక్ష చేయించుకోవడానికి హాస్పిటల్ కి వెళ్లాడు. అతని ముక్కును పరిశీలించిన వైద్యులు అతని గాయం మానలేదని,శుభ్రం చేయవలసి ఉందని తెలుసుకున్నారు.
Eye with gold: ఈమె చూపే బంగారం
ఒక యూట్యూబ్ వీడియో తనను ముక్కు శస్త్రచికిత్స గురించి ఆలోచించేలా చేసిందని, అందులో ముక్కును విస్తరించడానికి ట్రిక్ చెప్పబడిందని,దీంతో తానే ఆపరేషన్ చేసుకున్నాను అని ఆ వ్యక్తి స్వయంగా డాక్టర్ల ముందు అంగీకరించాడు. దీని తర్వాత వైద్యులు అతని గాయాన్ని శుభ్రం చేసి వైద్య విధానం ప్రకారం శస్త్రచికిత్స చేశారు. యూట్యూబ్ చూసి ఎవరూ అలా చేయవద్దని,అలా చేస్తేఎవరికైనా ప్రాణాపాయం తప్పదని వైద్యుల ద్వారా మాత్రమే శస్త్రచికిత్స చేయించుకోవడం సరైనదని వైద్యులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Viral story, Youtube