బ్రిటన్ ప్రధానిగా మళ్లీ గెలిచిన బోరిస్ జాన్సన్

Boris Johnson : బ్రిట్‌లో జరిగిన ఎన్నికల్లో బోరిస్ జాన్సన్‌కి చెందిన కన్జర్వేటివ్ పార్టీ తిరుగులేని మెజార్టీ సాధించింది. మరి నెక్ట్స్ ఏం జరగనుంది? బ్రెగ్జిట్ సంగతేంటి?

news18-telugu
Updated: December 13, 2019, 12:08 PM IST
బ్రిటన్ ప్రధానిగా మళ్లీ గెలిచిన బోరిస్ జాన్సన్
బోరిస్ జాన్సన్
  • Share this:
Britain Election : బ్రిటన్‌ ప్రధానిగా కన్జర్వేటివ్ పార్టీ అధినేత బోరిస్‌ జాన్సన్‌ మళ్లీ పాలించబోతున్నారు. ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ తిరుగులేని మెజార్టీ సాధించింది. మొత్తం 650 సీట్లలో 338 సీట్ల గెలుచుకొని... స్పష్టమైన ఆధిక్యం సాధించి... ప్రతిపక్ష లేబర్ పార్టీని 200 సీట్లకు దగ్గర్లో పరిమితం చేసి... రాజకీయ విశ్లేషకుల్ని ఆశ్చర్యంలో పడేశారు బోరిస్. ఐతే... బోరిస్‌ జాన్సన్‌ నడిపిస్తున్న కన్జర్వేటివ్‌ పార్టీ తప్పక గెలుస్తుందని ముందే సర్వేలు చెప్పేశాయి. అందుకు తగ్గట్టుగానే లేబర్‌ పార్టీ అంతంత మాత్రం ఫలితాలతో సరిపెట్టుకుంటోంది. ఆ పార్టీ అధినేత జెరెమీ కార్బిన్‌ తన పదవి నుంచీ దిగిపోయారు. ఇలాంటి ఫలితాలు వచ్చాక... ఇంకా తాను ఆ పదవిలో ఉండలేనన్న ఆయన... ఫ్యూచర్‌లోనూ కొనసాగలేనని తెలిపారు. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకు వెళ్లిపోవాలన్నదే (బ్రెగ్జిట్) ప్రధాన అజెండాగా ఈ ఎన్నికలు జరిగాయి. ఫలితాల్ని బట్టీ... ప్రజలు... బయటకు వెళ్లిపోయేందుకే ఆసక్తి చూపిస్తున్నారని తేలిపోయింది. ఇది వరకు కూడా ప్రజలు ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్రెగ్జిట్‌ అంశంపై పార్లమెంట్‌ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేకపోయింది. అందుకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. గురువారం ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయి.

జనవరిలో బ్రెగ్జిట్ అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. అప్పుడు యూరోపియన్ యూనియన్‌లోని 28 దేశాల్లో కీలకమైన దేశం బ్రిటన్... బయటకు వచ్చేసినట్లవుతుంది. ఈ ఫలితాల్ని యూరోపియన్ దేశాల అధినేతలు స్వాగతించారు. బ్రెగ్జిట్‌ తమకు ఇష్టం లేదంటూనే... ప్రజల అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.

సాహో భామ జాక్వెలిన్ అందాలు అదుర్స్
ఇవి కూడా చదవండి :

Health : చలికాలంలో తినదగ్గ 5 రకాల ప్రోటీన్ స్నాక్స్...

Baby Names : చిన్నారికి పేరు పెట్టాలా? ఈ టిప్స్ పాటించండిHealth : పర్పుల్ ఆలూ... తింటే మేలు

Health : సంతాన సమస్యలను దూరం చేసే ఆహారం... తప్పక తినాలి...


చక్కెర కంటే బెల్లం తినడం మేలు... ఎందుకంటే...
Published by: Krishna Kumar N
First published: December 13, 2019, 12:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading