Home /News /international /

BORIS JOHNSON STEPS DOWN AS BRITISH PM SAYS SAD TO GIVE UP BEST JOB IN THE WORLD SK

Boris Johnson: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా.. బాధగా ఉందని ఎమోషనల్

బోరిస్ జాన్సన్

బోరిస్ జాన్సన్

Boris Johnson Resigns: బ్రిటన్ కొత్త ప్రధాని రేసులో మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ (Rishi sunak), విదేశీ కామన్ వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ అఫైర్స్ సెక్రటరీ లిజ్ ట్రస్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

    బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ (Britain PM Boris Johnson) తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. రాజీనామా ప్రకటన సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆయన.. ప్రపంచంలోనే బెస్ట్ జాబ్ నుంచి తప్పుకుంటున్నందుకు ఎంతో బాధగా ఉందని ఎమోషనల్ అయ్యారు. బ్రిటన్‌కు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తన హయంలో సాధించిన విజయాల పట్ల తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఐతే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయన ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా కొనసాగుతారు. కన్జర్వేటివ్ పార్టీ సమావేశంలో కొత్త నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియ పూర్తయ్యే వరకు 58 ఏళ్ల జాన్సన్ ప్రధాని బాధ్యతలు నిర్వర్తిస్తారు. అక్టోబర్‌లో పార్టీ మహాసభలు జరగాల్సి ఉంది.ః

    Home Offers: డబ్బులు అవసరం లేదు.. పుచ్చకాయలు, గోధుమలు ఇస్తే చాలు.. కొత్త ఇల్లు మీ సొంతం



    బోరిస్ జాన్సన్ పాలనపై మంత్రులు, అధికారులు విశ్వాసం కోల్పోయారు. ఆయన పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ... ఇప్పటి వరకు 50 మందికి పైగా మంత్రులు, ఎంపీలు రాజీనామా చేశారు. ప్రభుత్వంపై అవిశ్వాసం ఎంతగా పెరిగిపోయిందంటే.. 36 గంటల క్రితం మంత్రి పదవి పొందిన మిచెల్ డొనెలన్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం సాయంత్రం వరకు 17 మంది క్యాబినెట్ మంత్రులు, 12 మంది పార్లమెంటరీ కార్యదర్శులు, నలుగురు విదేశీ ప్రభుత్వ ప్రతినిధులు రాజీనామాను ప్రకటించారు. బోరిస్ జాన్సన్ పాలనపై వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరోనా సంక్షోభాన్ని సరిగ్గా ఎదుర్కోలేకపోయారని, లాక్‌డౌన్ నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులుకు గురి చేశారని.. ఆయనపై ప్రజలతో పాటు మంత్రులు కూడా మండిపడుతున్నారు. అంతేకాదు బోరిస్ జాన్సన్‌ సెక్స్ స్కాండల్‌పై వస్తున్న ఆరోపణలను కూడా ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రులు, ఎంపీల నుంచి తీవ్రంగా ఒత్తిడి రావడంతో.. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని బోరిస్ నిర్ణయించుకున్నారు.



    బ్రిటన్ కొత్త ప్రధాని రేసులో మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ (Rishi sunak), విదేశీ కామన్ వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ అఫైర్స్ సెక్రటరీ లిజ్ ట్రస్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కాగా, కరోనా రిలీఫ్ ప్యాకేజీ కారణంగా సునక్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. ప్రధానమంత్రి పదవి కోసం రిషి సునక్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే ఆయన భార్య అక్షతా మూర్తి కూడా యాక్టివ్‌గా మారారు. అక్షత ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె. అంటే నారాయణమూర్తికి ఆయన అల్లుడవుతారు. రిషి సునక్‌తో పాటు లిజ్ ట్రుజ్, బెన్ వాలెన్స్, మిచెట్ గోవ్, సాజివ్ జావిద్ కూడా ప్రధాని మంత్రి రేసులో ఉన్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Boris Johnson, Britain, Britain prime minister, International news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు