Boris Johnson Rishi Sunak To Be Fined: ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. దీని ప్రభావానికి దేశాల ఆర్థిక పరిస్థితులు తలకిందులుగా మారిపోయాయి. ఇప్పటికి కూడా కొన్ని దేశాలు కఠిన ఆంక్షలను పాటిస్తున్నాయి. లాక్ డౌన్ నిబంధలను ఖచ్చితంగా పాటిస్తున్నాయి. ఇక కరోనా కొత్త కొత్త వేరియంట్ లతో ప్రపంచంపై విరుచుకు పడుతుంది. అనేక దేశాలు బయటి దేశాల నుంచి రాకపోకలను పూర్తిగా నిషేధించాయి.
ఇక చైనాలో కరోనా మరోసారి తన ప్రతాపాన్నిచూపిస్తుంది. అక్కడ ప్రతి రోజు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే అక్కడ కఠిన మైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. మన దేశంలో కరోనా సమయంలో.. సాధారణ ప్రజల నుంచి వీఐపీల వరకు లాక్ డౌన్ నిబంధలను ఉల్లంఘించారు. కొందరు అధికారులు చూసి చూడనట్టు వదిలేశారు. ఇక కొన్ని దేశాలు మాత్రం లాక్ డౌన్ నిబంధలను ఇప్పటికి కఠినంగా అమలు చేస్తున్నాయి. బ్రిటన్ లో ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆర్థిక మంత్రి రిషి సునక్ లు గతంలో లాక్ డౌన్ ఉల్లంఘించారని వారిపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
లాక్ డౌన్ సమయంలో నిబంధలను విరుద్దంగా పార్టీగేట్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారన్న అభియోగాల మీద వీరికి పెనాల్టీ నోటిసులు జారీ చేయనున్నారు. అయితే, అక్కడి ప్రతి పకాలు ఒక అడుగు ముందుకు వేసి బ్రిటన్ ప్రధాని, మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. బ్రిటన్ అధికారులు విచారణలో ఇరువురు నిబంధలను ఉల్లంఘించారని తెలింది. దీంతో వీరికి నోటిసులు పంపడానికి అధికారులు సిద్దపడ్డారు.
దీనిపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్పందించారు. తాను కరోనా నిబంధనలు పాటించానని తెలిసి.. ఏ తప్పు చేయలేదని అన్నారు. బోరిస్ జాన్సన్ సతీమణి క్యారీకి కూడా జరిమాన విధిస్తున్నట్లు తెలుస్తోంది. 2021 లో లాక్ డౌన్ నిబంధనల తర్వాత.. ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన క్షమాపణలు కూడా తెలిపారు. రష్యా దాడులను ఎదుర్కొవడానికి , బోరిస్ జాన్సన్ ఆయుధాలు, ఇతన సహాకారాన్ని అందిస్తు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.
బోరిస్ జాన్సన్ మరియు రిషి సునక్ లు లాక్ డౌన్ చట్టాన్ని ఉల్లంఘించారు. అదే విధంగా.. బ్రిటిష్ ప్రజలకు పదేపదే అబద్ధాలు చెప్పారు. వారిద్దరూ రాజీనామా చేయాల్సిందే అని ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ నాయకుడు కైర్ స్టార్మర్ డిమాంగ్ చేశారు. ఇక.. లిబరల్ డెమోక్రాట్లు బ్రిటన్ పార్లమెంటును వెంటనే జాన్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ సంఘటన బ్రిటన్ రాజకీయాల్లో కలకలంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid 19 restrictions, Lockdown violation, United Kingdom