హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Boris Jhonson : ఈ నెలాఖరులో భారత్ కు బ్రిటన్ ప్రధాని

Boris Jhonson : ఈ నెలాఖరులో భారత్ కు బ్రిటన్ ప్రధాని

బ్రిటన్ ప్రధానితో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ (File - image credit - twitter)

బ్రిటన్ ప్రధానితో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ (File - image credit - twitter)

Boris Jhonson India Visit : గత ఏడాది యూకే అధ్యక్షతన జరిగిన జీ7 దేశాల సమావేశానికి హాజరు కావాలని యూకే ప్రధాని మోదీని ఆహ్వానించిన విషయం తెలిసిందే. మేలో జరిగిన వర్చువల్‌ సమ్మిట్‌లో బ్రిటన్‌ ప్రధానితో మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించారు.

ఇంకా చదవండి ...

Boris Jhonson To Visit India : యూకే ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ ఈ నెలాఖరులో భారత్‌ లో పర్యటించనున్నారు. భారతదేశం-యుకె స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చల నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ నెలాఖరులో భారత్‌లో పర్యటించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం రెండుసార్లు భారత పర్యటనను రద్దు చేసుకున్నారు బోరిస్ జాన్సన్. గతేడాది జనవరిలో గణతంత్ర దినోత్సవానికి భారత్‌ ఆహ్వానించగా.. యూకేలో కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో వాయిదా పడింది. మళ్లీ ఏప్రిల్‌లో పర్యటన ఖరారు కాగా.. భారత్‌లో కరోనా మళ్లీ కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో రద్దయ్యింది.

ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ నెల 22న ఢిల్లీకి బోరిస్ రానున్నట్లు సమాచారం. భారత పర్యటనలో ప్రధాని మోదీతో..బోరిస్ జాన్సన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. యూకే, భారత్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపే అవకాశం ఉంది.అయితే అటు బ్రిటన్ ప్రధాని కార్యాలయం కానీ,ఇటు భారత్ ను బోరిస్ పర్యటనను అధికారికంగా దృవీకరించలేదు.  గత ఏడాది యూకే అధ్యక్షతన జరిగిన జీ7 దేశాల సమావేశానికి హాజరు కావాలని యూకే ప్రధాని మోదీని ఆహ్వానించిన విషయం తెలిసిందే.

ALSO READ Biden On Putin : పుతిన్ యుద్ధనేరస్తుడే..విచారణ చేపట్టాల్సిందేన్న బైడెన్

గతేడాది మేలో జరిగిన వర్చువల్‌ సమ్మిట్‌లో బ్రిటన్‌ ప్రధానితో మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించారు. 2030 నాటికి వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించారు. ఆరోగ్యం, వాతావరణం, వాణిజ్యం, విద్య, సైన్స్‌, టెక్నాలజీ, రక్షణలో యూకే, భారత్‌ కలిసి పని చేయాలని నిర్ణయించారు. గత నెలలో యూకే విదేశాంగ కార్యదర్శి లిజ్‌ ట్రస్‌ ఢిల్లీలో పర్యటించారు. అంతకు ముందు అక్టోబర్‌ లోను ఆమె భారత్‌కు వచ్చారు. గత నెలలో జాన్సన్ మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్య ఫోన్ కాల్ సంభాషణ జరిగిన విషయం తెలిసిందే.

First published:

Tags: India, Uk

ఉత్తమ కథలు