బ్రిటన్‌ నూతన ప్రధానిగా బోరిస్‌ జాన్సన్‌ బాధ్యతలు...

బ్రిటన్‌ నూతన ప్రధానిగా బోరిస్‌ జాన్సన్‌ బాధ్యతలు...

బోరిస్ జాన్సన్ (Image : boris johnson / Instagram)

మాజీ ప్రధాని థెరిసా మే స్థానంలో నూతన ప్రధానిని ఎన్నుకున్నారు. దీని కోసం రహస్య ఓటింగ్‌ పద్దతి జరపగా, బోరిస్‌ జాన్సన్‌ విజయం సాధించారు.

  • Share this:
    బ్రిటన్‌ నూతన ప్రధానిగా బోరిస్‌ జాన్సన్‌ ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్‌ పార్టీ మంగళవారం ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మాజీ ప్రధాని థెరిసా మే స్థానంలో నూతన ప్రధానిని ఎన్నుకున్నారు. దీని కోసం రహస్య ఓటింగ్‌ పద్ధతి జరపగా, బోరిస్‌ జాన్సన్‌ విజయం సాధించారు. మొత్తం 1,59,320 మంది కన్సర్వేటివ్ పార్టీ సభ్యుల్లో 87.4 శాతం మంది ఓట్లు వేశారు. 92,153 ఓట్లు సాధించిన జాన్సన్ విజయం సాధించారు. కాగా జాన్సన్ ప్రత్యర్థి జెరెమీ హంట్‌కు 46,656 ఓట్లు లభించాయి. బ్రిటన్‌ ప్రధానిగా పదవీ బాధ్యతలు బుధవారం మధ్యాహ్నాం బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే ఆయన గతంలో ఆయన విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు జాన్సన్‌కి గతంలో లండన్ మేయర్‌గా పనిచేసిన అనుభవం ఉంది.
    Published by:Krishna Adithya
    First published:

    అగ్ర కథనాలు