ఒక్కడి కోసం జంబో విమాన సర్వీసు...ఎందుకో తెలుసా ?

లిథువేనియా నుంచి ఇటలీ వెళ్తున్న బోయింగ్ 737 విమానంలో మొత్తానికి ఒకే ఒక టిక్కెట్ రిజర్వ్ అయ్యింది. దీంతో ఫ్లైట్ రద్దు చేసే చాన్స్ లేకపోవడంతో విమానాన్ని ఇటలీలోని బెర్గమో సిటీ వరకూ సర్వీసు ఇవ్వాల్సి వచ్చింది.

news18-telugu
Updated: April 3, 2019, 11:08 PM IST
ఒక్కడి కోసం జంబో విమాన సర్వీసు...ఎందుకో తెలుసా ?
( Image : Instagram )
news18-telugu
Updated: April 3, 2019, 11:08 PM IST
సాధారణంగా ఇండియన్ రైల్వేస్ గురించి ఒక ఫేమస్ డైలాగ్ ఉంది. ఒక్కడి కోసం రైలు ఆగదు...ఒక్కడు ఉన్నా రైలు అగదు... అనేది సినిమాల్లో కూడా వాడేసిన డైలాగ్. సరిగ్గా అలాంటి పరిస్థితే ఒక జంబో బోయింగ్ విమానంలో సంభవించింది. ఇటీవల లిథువేనియా నుంచి ఇటలీ వెళ్తున్న బోయింగ్ 737 విమానంలో మొత్తానికి ఒకే ఒక టిక్కెట్ రిజర్వ్ అయ్యింది. దీంతో ఫ్లైట్ రద్దు చేసే చాన్స్ లేకపోవడంతో విమానాన్ని ఇటలీలోని బెర్గమో సిటీ వరకూ సర్వీసు ఇవ్వాల్సి వచ్చింది.

అయితే మొత్తం విమానం మొత్తానికి ప్రయాణించిన ఏకైక ప్రయాణికుడి పేరు స్కిర్‌మంటాస్ స్ట్రిమైటిస్ గా గుర్తించారు. మార్చి 16 న హాలిడే వెకేషన్ గడిపేందుకు బెర్గామోకు టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. అయితే తీరా విమానం ఎక్కిన తర్వాత చూస్తే మొత్తం జంబోజెట్ విమానమంతా ఖాళీగా ఉంది. మొత్తం 188 మంది పట్టే సామర్థ్యం ఉన్న ఈ జంబో విమానంలో కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రయాణించాల్సి వచ్చింది. అయితే విమానంలో సెల్ఫీ దిగి స్కిర్ మంటాస్ తన స్నేహితులదరితోనూ తన అనుభవాన్ని పంచుకున్నాడు.

First published: April 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...