Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    ఫ్లోరిడా నదిలోకి దూసుకెళ్లిన బోయింగ్ విమానం... ప్రయాణికులు క్షేమం...

    Jacksonville : విమాన ప్రమాదాలు జరిగితే... ప్రయాణికులు సురక్షితంగా బయటపడే సందర్భాలు తక్కువ. ఈ ఘటనలో ఏం జరిగింది. అసలు ప్రమాదం ఎలా జరిగింది.

    Krishna Kumar N | news18-telugu
    Updated: May 4, 2019, 10:02 AM IST
    ఫ్లోరిడా నదిలోకి దూసుకెళ్లిన బోయింగ్ విమానం... ప్రయాణికులు క్షేమం...
    నదిలోకి దూసుకెళ్లిన విమానం (Image : Twitter)
    • Share this:
    అది ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లే. అక్కడి ఎయిర్‌పోర్టులో బోయింగ్ 737 విమానం ల్యాండ్ అయ్యింది. ఐతే... ల్యాండ్ అయ్యే సమయంలో స్కిడ్ అయ్యింది. రన్‌వే నుంచీ... పక్కకు వెళ్లి... అక్కడి సెయింట్ జాన్స్ నదిలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో విమానంలో 136 మంది ప్రయాణికులున్నారు. ఒక్క క్షణం వాళ్లంతా దేవుడే తమను కాపాడాలని కోరుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎయిర్ ‌పోర్ట్ అధికారులంతా అలర్ట్ అయ్యారు. ప్రయాణికుల్ని రక్షించడమే విధిగా అందరూ రెస్క్యూ ఆపరేషన్‌లో పాలు పంచుకున్నారు. నేవీ సెక్యూరిటీ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ పర్సన్స్ కూడా రంగంలోకి దిగారు. ప్రత్యేక బోట్లలో అత్యంత వేగంగా ప్రయాణికుల్ని ఒడ్డుకి చేర్చారు. ప్రయాణికుల్లో చాలా మంది తమకు ఈత రాదని చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యం అయివుంటే... ప్రాణనష్టం జరిగేదే.


    క్యూబాలోని నావల్ స్టేషన్ గ్వాంటనామో బే నుంచీ ఈ విమానం... నావల్ ఎయిర్ స్టేషన్ జాక్సన్‌విల్లే వచ్చినట్లు అధికారులు తెలిపారు. లక్కేంటంటే... ప్రస్తుతం నదిలో ఎక్కువ నీరు లేదు. అందువల్ల విమానం పూర్తిగా నీటిలో మునిగిపోలేదు. సగానికి పైగా పైకే ఉంది.

    ప్రయాణికులంతా ప్రాణాలతో ఉండటంతో... అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు అదృష్టవంతులని ఈ ఘటన చూసిన వాళ్లు చెబుతున్నారు.

    ఇవి కూడా చదవండి :

    గేమ్స్ ఆడుతుంటే పేలిన సెల్‌ఫోన్... ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమం

    కేబినెట్ కూర్పుపై జగన్ దృష్టి... తూర్పు గోదావరి జిల్లా నేతకు అత్యంత కీలక మంత్రి పదవి ?

    ఏపీలో రాజకీయ సంక్షోభం... టార్గెట్ చంద్రబాబు ? రాష్ట్రపతి పాలన తెస్తారా ?

    కరెంటు షాక్ కొట్టిన కూలర్... ఆరేళ్ల చిన్నారి మృతి
    Published by: Krishna Kumar N
    First published: May 4, 2019, 10:02 AM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading