Boat capsizes: పడవ మునక... 57 మంది జలసమాధి!

Boat capsizes: పడవ మునక... 57 మంది జలసమాధి! (image credit - ANI - FILE IMAGE)

Boat capsizes: ఈ పడవ ప్రమాదం... పాపికొండలు పడవ ప్రమాదాన్ని గుర్తు చేస్తోంది. అసలు ఇది ఎలా జరిగింది? అంత మంది ఎలా చనిపోయారు? ఎక్కడ తేడా వచ్చింది? పూర్తి వివరాలు.

  • Share this:
    Boat capsizes: లిబియాలోని ట్రిపోలీలో... జరిగిన పడవ ప్రమాదంలో 57 మంది చనిపోయారని తెలిసింది. శరణార్థులను తీసుకెళ్తున్న పడవ... పక్కకు ఒరిగి నీటిలో మునిగిపోయిందని ఐక్యరాజ్యసమితి శరణార్థుల అధికారులు తెలిపారు. శరణార్థుల అంతర్జాతీయ సంస్థ ప్రతినిధి సఫా సేహ్లీ (Safa Msehli) ప్రకారం... ఆదివారం ఆ పడవ... ఖూమ్స్ పట్టణ పశ్చిమ తీరం నుంచి బయలుదేరింది. అందులో 75 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పినట్లు అల్ జజీరా తెలిపింది. ప్రమాదం జరిగాక... 18 మందిని కాపాడి... సోమవారం తీరానికి తీసుకొచ్చారని సేహ్లీ చెప్పారు. బతికిన వాళ్లలో నైజీరియా, ఘనా, గాంబియాకు చెందిన వాళ్లున్నారు. సముద్రంలో వెళ్తుండగా... బోటుకు ఇంజిన్ సమస్య తలెత్తింది. దాంతో బోటు ఆగిపోయింది. అదే సమయంలో అక్కడ వాతావరణం అస్సలు బాలేదు. దాంతో అలల తాకిడి ఎక్కువై బోటు మునిగిపోయిందని సెహ్లీ చెప్పారు.

    "బోటు మునిగిపోవడాన్ని కొందరు చేపల జాలర్లు చూశారు. వెంటనే రంగంలోకి దిగి... ప్రాణాలకు తెగించి కొందరిని కాపాడారు. అదే సమయంలో... కోస్ట్ గార్డ్ కూడా రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. చనిపోయిన వారిలో 20 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు" అని సెహ్లీ... తన ట్విట్టర్‌ ఆకౌంట్‌లో తెలిపారు.


    మధ్యధరా సముద్రం (Mediterranean Sea)లో ఎన్నో విషాద గాథలు. వాటిలో ఇది తాజాది. ప్రమాదకరమైన ఆ సముద్రంలో రోజూ కొన్ని వందల మంది... యూరప్ దేశాలకు శరణార్థులుగా వెళ్తున్నారు. అక్కడ ఏదో ఒక ఉపాధి వెతుక్కొని జీవించవచ్చు అని భావిస్తున్నారు. ఇదే సముద్రంలో గత వారం 20 మంది చనిపోయారు. మరో 500 మందిని అప్పటికప్పుడు వెనక్కి అంటే లిబియాకి తీసుకొచ్చేశారు.

    ఈమధ్య లిబియా నుంచి విదేశాలకు శరణార్థులుగా వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. యూరోపియన్ యూనియన్ సాయం చేస్తున్న లిబియాలో కోస్టు గార్డులు... ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో దాదాపు 15,000 మంది వలస దారులను మధ్యలోనే అడ్డుకొని వెనక్కి తీసుకొచ్చారు.

    అమ్నె్స్టీ ఇంటర్నేషనల్ కూడా... గత ఆరు నెలల్లో 7,000 మందిని సముద్రంలో అడ్డుకొని... లిబియాలోని డిటెన్షన్ క్యాంపులకు తరలించింది.

    ఇది కూడా చదవండి: దారుణం... వృద్ధురాలిపై నలుగురు గ్యాంగ్ రేప్... కారంపొడితో...

    2011 నుంచి లిబియాలో అంతర్గత యుద్ధం జరుగుతోంది. అందువల్ల చాలా మంది యూరప్ వెళ్లిపోవాలనుకుంటున్నారు. అక్రమంగా తరలిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా వాళ్లను తరలించే బోట్లలో పరమితికి మించి ఎక్కించేసుకోవడంతో... ఆ బోట్లు సముద్రంలో బోల్తాపడి... వారిని జలసమాధి చేస్తున్నాయి.
    Published by:Krishna Kumar N
    First published: