చంద్రుడిపై అమెజాన్ సర్వీసులు...2024 నాటికి చంద్రమండలంపై భారీ ప్రాజెక్టులు...

బ్లూ ఆరిజన్ నుంచి వచ్చిన లూనార్ లాండర్ ఒక చిన్న సైజు ఇల్లు తరహాలో ఉంది. అంతేకాదు, మొత్తం నాలుగు రోవర్లతో పాటు కొత్తగా డిజైన్ చేసిన రాకెట్ ఇంజిన్లు దీనికి అనుసంధానించబడి ఉంటాయి. ఈ రోవర్ సహాయంతో చంద్రుడిపై సేఫ్ గా ల్యాండ్ అవడంతో పాటు, నివాసం ఉండేందుకు సరిపడా చోటు ఉంది.

news18-telugu
Updated: May 10, 2019, 3:34 PM IST
చంద్రుడిపై అమెజాన్ సర్వీసులు...2024 నాటికి చంద్రమండలంపై భారీ ప్రాజెక్టులు...
బ్లూ మూన్ ప్రాజెక్టును ప్రకటించిన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్..(Image : AP)
news18-telugu
Updated: May 10, 2019, 3:34 PM IST
ప్రపంచంలోనే నెంబర్ వన్ శ్రీమంతుడు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సరికొత్త ప్రయోగానికి తెరలేపారు. బ్లూ మూన్ ప్రాజెక్టు పేరిట చంద్రమండలం మీదకు రానున్న 5 సంవత్సరాల్లో మనుషులను పంపే టూరిజం బిజినెస్ కోసం లూనార్ లాండర్ ను తయారు చేసింది. అమెజాన్ సంస్థకు చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ స్పేస్ రీసెర్చ్ సంస్థగా ప్రయోగాలు చేపడుతోంది. అదే సంస్థ నుంచి ఈ బ్లూ మూన్ ప్రాజెక్టు ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే బ్లూ ఆరిజన్ నుంచి వచ్చిన లూనార్ లాండర్ ఒక చిన్న సైజు ఇల్లు తరహాలో ఉంది. అంతేకాదు, మొత్తం నాలుగు రోవర్లతో పాటు కొత్తగా డిజైన్ చేసిన రాకెట్ ఇంజిన్లు దీనికి అనుసంధానించబడి ఉంటాయి. ఈ రోవర్ సహాయంతో చంద్రుడిపై సేఫ్ గా  ల్యాండ్ అవడంతో పాటు, నివాసం ఉండేందుకు సరిపడా చోటు ఉంది. అంతే కాదు, రానున్న కొద్ది సంవత్సరాల్లో చంద్రమండలంపై భారీ ప్రాజెక్టులు సైతం నిర్మిస్తామని అమెజాన్ తెలిపింది.

ఇదిలా ఉంటే  గురువారం అంగరంగ వైభవంగా వాషింగ్టన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్లూ మూన్ లూనార్ లాండర్ వెహికిల్ ను ఆవిష్కరించారు. యాపిల్ ఐఫోన్ లాంచింగ్ కార్యక్రమం తరహాలో ఈ బ్లూమూన్ ప్రాజెక్టును ప్రకటించింది. ఇదిలా ఉంటే బ్లూ ఓరిజన్ వైస్ ప్రెసిడెంట్ క్లారీ మౌరీ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ... 2024 నాటికి మానవ సహిత రోవర్ ను చంద్రుడి మీదకు పంపడమే తమ లక్ష్యమని నాసా కూ ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉందని తెలిపారు. అలాగే ఇదే ప్రాజెక్టులో పనిచేస్తున్న రాబర్ట్ వాకర్ అనే స్పేస్ కన్సల్టెంట్ ముందుగా 2023 నాటికి మనుషులు లేని రోవర్ ను ప్రయోగాత్మకంగా చంద్రుడి మీదకు పంపుతామని తెలిపారు.

మరోవైపు ఈ ప్రాజెక్టుకు సంబంధించి రీయూజబుల్ రాకెట్ ను 2017లోనే తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తద్వారా రాకెట్ లాంచింగ్ ఖర్చు తగ్గుతుంది. కొత్త రాకెట్లను పదేపదే తయారు చేయాల్సిన అవసరం ఉందదు. కాగా 1960వ దశకంలో చంద్రుడిపై ప్రయోగాలు ప్రారంభం కాగా 50 ఏళ్ల క్రితమే మనషి చంద్రుడిపై పాదం మోపాడు. కాగా అమెజాన్ ప్రయోగం కనుక సక్సెస్ అయితే మాత్రం కొత్త అధ్యాయం మొదలవుతుంది. స్పేస్ టూరిజంలో ఒక ప్రైవేటు సంస్థ సాధించిన తొలివిజయంగా చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది.

First published: May 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...