హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Kabul Blast: ఆఫ్ఘనిస్థాన్ లో మరోసారి బాంబుల మోత​.. ఈ ఘటనకు పాల్పడింది ఆ సంస్థేనా..!

Kabul Blast: ఆఫ్ఘనిస్థాన్ లో మరోసారి బాంబుల మోత​.. ఈ ఘటనకు పాల్పడింది ఆ సంస్థేనా..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Kabul Blast: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్ లో వరుసగా బాంబు పేళుళ్లతో ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడ్డారు. అక్కడ ఓ పాఠశాల సమీపంలో జరిగిన ఈ ఘటనలో 30 మంది అక్కడిక్కడే మృతి చెందగా మరో 50 మందికి పైగా గాయపడ్డారు.

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్ లో బాంబు పేలుళ్లు మరోసారి కలకలం రేపాయి. అఫ్గాన్ లో అధికంగా నివసించే షియాలు ఉండే ప్రాంతంలోని ఓ బాలికల పాఠశాల వద్ద ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో బాలికలు పాఠశాల నుంచి ఇళ్లకు బయలుదేరుతున్నారు. మొదట కార్ బాంబు పేలింది. తర్వాత రెండు రాకెట్లను పేల్చారు. ఈ దాడిలో చనిపోయిన 30 మందిలో ఎక్కువగా యువతే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య మంత్రి గులాం దస్తగిర్​ నాజరి తెలిపారు. పేలుడు జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలానికి చేరుకున్న అంబులెన్సులు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించామని అఫ్గాన్ మంత్రి తారీఖ్​ అరియాన్​ తెలిపారు. అయితే, అంబులెన్సులను అడ్డుకుని ప్రజలు దాడులకు తెగబడ్డారని దీంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రి గులాం దస్తగిర్​ నాజరి అన్నారు. వారిని సముదాయించి అంబులెన్సులు వెళ్లేలా చేశామన్నారు.

కాగా, ఈ దాడులకు పాల్పడింది తామేనని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. ఈ దాడులు జరిపింది తాము కాదంటూ తాలిబన్ ప్రకటించింది. గాయపడిని వారిని ఆసుపత్రికి తరలించగా వారికి రక్తదానం చేయడానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. ఇటీవల ఐసిస్ బాంబు పేలుళ్లతో విరుచుకుపడుతోంది. మైనారిటీ షియాలపై ఉగ్ర సంస్థ ఐసిస్ బాంబులనుపేల్చగా చాలా మంది చనిపోయారు . ఇటువంటి నీచమైన చర్యలకు ఐసిస్ మాత్రమే పాల్పడుతుందని తాలిబన్ ప్రకటించింది.

First published:

Tags: Afghanistan, BLAST, Blasts, Kabul blast, Kills

ఉత్తమ కథలు