ఆఫ్ఘనిస్తాన్ ఉపాధ్యక్షుడి కాన్వాయ్‌పై ఉగ్రదాడి.. 15 మందికి పైగా మృతి

గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన అమ్రుల్లా సలేను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. గతంలోనూ ఆయనపై పలుమార్లు దాడి చేశారు.

news18-telugu
Updated: September 9, 2020, 2:40 PM IST
ఆఫ్ఘనిస్తాన్ ఉపాధ్యక్షుడి కాన్వాయ్‌పై ఉగ్రదాడి.. 15 మందికి పైగా మృతి
ఆఫ్ఘనిస్తాన్ ఉపాధ్యక్షుడి కాన్వాయ్‌పై ఉగ్రదాడి.. 15 మందికి పైగా మృతి
  • Share this:
ఆఫ్ఘనిస్తాన్‌లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజధాని కాబూల్ సిటీ బాంబు మోతతో దద్దరిల్లింది. ఆఫ్ఘనిస్తాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలే కాన్వాయ్‌పై బాంబులతో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఆయన క్వానాయ్ ప్రయాణించే మార్గంలో ఓ కల్వర్ట్ కింద పెద్ద ఎత్తున బాంబులు పెట్టి పేల్చేశారు. ఈ ఘటనలో అమ్రుల్లా సలే స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరో 15 మందికి పైగా మరణించగా.. 30 మందికి గాయాలయ్యాయి. పేలుడు ధాటికి రోడ్డు చుట్టుపక్కల భవనాలు ధ్వంసమయ్యాయి. వాహనాలు తునాతునకలయ్యాయి.


వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేను సురక్షితంగా ఆఫీసుకు తరలించారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. పేలుడులో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఘటన తర్వాత కాసేపటికి ఉపాధ్యక్షుడు సలే మీడియాతో మాట్లాడారు. తాను క్షేమంగానే ఉన్నానని చెప్పారు. ఘటనను తీవ్రంగా ఖండించిన సలే.. దీనిని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. హక్కానీ నెటవర్క్‌కు చెందిన ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు.

కాగా, గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన అమ్రుల్లా సలేను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. గతంలోనూ ఆయనపై పలుమార్లు దాడి చేశారు. 2019లో కూడా అమ్రుల్లా సలే కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగింది. ఆ ఘటనలో 20 మంది మరణించారు. కాబూల్ ఉగ్రదాడిని భారత ప్రభుత్వం ఖండించింది. పేలుడులో చనిపోయిన వారి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. ఉగ్రవాద నిర్మూలన కోసం ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని మరోసారి స్పష్టం చేసింది.
Published by: Shiva Kumar Addula
First published: September 9, 2020, 2:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading