White population: అమెరికాలో వేగంగా పడిపోతున్న తెల్లజాతీయుల జనాభా.. తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

ప్రతీకాత్మక చిత్రం

లాటినో అమెరికన్లు లేదా నల్లజాతీయుల మొత్తం జనాభాలో మూడింట ఒక వంతు అమెరికాలోనే జన్మించారు. మిగిలిన జనాభా ఇతర దేశాల నుంచి వలస కారణంగా పెరిగింది.

  • Share this:
అమెరికాలో తెల్లజాతీయుల జనాభా వేగంగా తగ్గిపోతోంది. గత నాలుగు సంవత్సరాలుగా నల్లజాతీయులతో పోలిస్తే వీరి జనాభా గణనీయంగా తగ్గింది. శ్వేతజాతి ప్రజలు ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, తక్కువ మంది పిల్లలను కనడంతో ఈ ధోరణి కనిపిస్తోందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. సెన్సెస్ డేటా ప్రకారం, గత నాలుగు సంవత్సరాల్లో తెల్లజాతీయుల జనాభా 1 మిలియన్​ (10 లక్షల)కు పైగా తగ్గింది. 2010 నుంచి 2016 వరకు వీరి జనాభా పెరుగుదల స్తంభించి, తగ్గుదల ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ నాలుగేళ్లలో జనాభా వేగంగా పడిపోయింది.

2016 నుంచి 2017 మధ్య కాలంలో1,29,000 మంది, 2019 నుంచి 2020 వరకు 4,82,000 మంది తెల్లజాతీయుల జనాభా తగ్గింది. ఫలితంగా 2010–2020 దశాబ్దంలో దాదాపు పది లక్షల మంది శ్వేతజాతీయులు తగ్గిపోయారు. ఈ లెక్కన 2010 జులై నుంచి 2020 జులై మధ్య కాలంలో వీరి జనాభా 63.8 శాతం నుంచి 59.7 శాతానికి పడిపోయింది. అమెరికాలో తెల్లజాతీయుల జనాభా ఇంత వేగంగా పడిపోవడం ఇదే తొలిసారి. అందువల్ల 2010 దశాబ్దం తెల్లజాతీయులకు పెద్ద నష్టాన్ని కలగజేసిందని నిపుణులు చెబుతున్నారు.

ఓపైపు తెల్లజాతీయుల జనాభా వేగంగా తగ్గుతుండగా.. మరోవైపు నల్లజాతీయుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అక్కడ శ్వేత జాతీయులు మైనారిటీ స్థాయికి పడిపోయే పరిస్థితికి చేరుకున్నారు. నల్లజాతీయులుగా పేరొందిన హిస్పానిక్ లేదా లాటినో అమెరికన్ల జనాభా గత పదేళ్లలో10.5 మిలియన్ల మేర పెరిగింది. ఇక ఆసియా అమెరికన్ల జనాభా గత పదేళ్లలో 4.7 మిలియన్ల మేర పెరిగింది. మరోవైపు ఆఫ్రికన్ -అమెరికన్లు కూడా గత పదేళల్లో ఏటా 3 లక్షల మంది పెరిగారు. తద్వారా 2010 నుంచి ఇప్పటి వరకు వారి జనాభా 3.4 మిలియన్ల వరకు పెరిగింది.

వేగంగా పెరుగుతున్న నల్లజాతీయుల జనాభా
లాటినో అమెరికన్లు లేదా నల్లజాతీయుల మొత్తం జనాభాలో మూడింట ఒక వంతు అమెరికాలోనే జన్మించారు. మిగిలిన జనాభా ఇతర దేశాల నుంచి వలస కారణంగా పెరిగింది. 2016 నుంచి 2020 వరకు యూఎస్ జనాభా పెరుగుదల అంతా నల్లజాతీయుల వల్లే నమోదైంది. ఇది తెల్లజాతీయుల్లో ఆందోళనకరంగా మారిందని సెన్సెస్ డేటాను సమీక్షించిన బ్రూకింగ్ ఇనిస్టిట్యూషన్ సీనియర్ ఫెలో విలియం ఫ్రే తెలిపారు. కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇల్లినాయిస్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, ఫ్లోరిడా, అరిజోనా, నార్త్ కరోలినా, దక్షిణ కరోలినా, ఉటా, కొలరాడో, టేనస్సీ, టెక్సాస్, ఇడాహో వంటి 30 రాష్ట్రాల్లో తెల్లజాతీయుల జనాభా వేగంగా తగ్గిపోయిందని ఫ్రే గుర్తించారు.

ఇవి కూడా చదవండి:

England Shooting: ఇంగ్లండ్‌లో భీకర కాల్పులు.. ఆరుగురు మృతి.. 11 ఏళ్ల తర్వాత తొలిసారి..

తాలిబన్ల చేతుల్లోకి కాందహార్.. మిగిలింది కాబూల్ మాత్రమే.. అట్టుడుకుతున్న ఆఫ్ఘాన్
Published by:Shiva Kumar Addula
First published: