అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మైకేల్ బ్లూమ్‌బర్గ్...ట్రంప్‌కు గట్టి పోటీ

డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగంలో దిగనున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలియచేశాయి. రాబోయే రోజుల్లో అధికారికంగా బ్లూమ్‌బర్గ్‌ ప్రకటన చేయనున్నారని ఆయన ప్రతినిధులు మీడియాతో తెలిపారు.

news18-telugu
Updated: November 13, 2019, 11:04 PM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మైకేల్ బ్లూమ్‌బర్గ్...ట్రంప్‌కు గట్టి పోటీ
Michael Bloomberg (Forbes)
  • Share this:
న్యూయార్క్‌ నగర మాజీ మేయర్‌, అత్యంత సంపన్నుడైన మైకేల్‌ బ్లూమ్‌బర్గ్‌ 2020లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనన్నట్లు తెలుస్తోంది. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగంలో దిగనున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలియచేశాయి. రాబోయే రోజుల్లో అధికారికంగా బ్లూమ్‌బర్గ్‌ ప్రకటన చేయనున్నారని ఆయన ప్రతినిధులు మీడియాతో  తెలిపారు. కాగా బ్లూమ్‌బర్గ్ రాజకీయ ప్రవేశంపై  అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందిస్తూ డెమోక్రటిక్‌ పార్టీ నామినేషన్‌ కోసం రంగంలో ఉన్న జోరు బిడెన్‌కే దీనివల్ల నష్టం జరుగుతుందని, తనకేమీ నష్టం ఉండదని అన్నారు. మాజీ ఉపాధ్యక్షుడైన బిడెన్‌ తక్కిన పోటీ దారుల కంటే ముందంజలో ఉన్నారు. ఆయన తర్వాత స్థానంలో బెర్నీ శాండర్స్‌, ఎలిజబెత్‌ వారన్‌ ఉన్నారు. ట్రంప్‌ను ఓడించేందుకే బ్లూమ్‌బర్గ్‌ రంగంలోకి దిగుతున్నారని పరిశీలకులు చెబుతున్నారు.

First published: November 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...