గాంధీ ఆశయాల కొనసాగింపునకు అమెరికాలో బిల్లు...

భారత జాతిపిత మహాత్మాగాంధీ, అమెరికా పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఆశయాలను కొనసాగించాలంటూ అమెరికాలోని ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టారు.

news18-telugu
Updated: December 21, 2019, 6:13 PM IST
గాంధీ ఆశయాల కొనసాగింపునకు అమెరికాలో బిల్లు...
మహాత్మాగాంధీ (Image: Getty Images)
  • Share this:
భారత జాతిపిత మహాత్మాగాంధీ, అమెరికా పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఆశయాలను కొనసాగించాలంటూ అమెరికాలోని ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ప్రతినిధుల సభ సభ్యుడు, అమెరికా పౌరహక్కుల నాయకుడు జాన్ లెవిస్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. వారి ఆశయాలను కొనసాగించేందుకు వచ్చే ఐదేళ్లలో 150 మిలియన్ డాలర్లను బడ్జెట్‌లో కేటాయించాలని కోరారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రతినిధుల సభలో (బిల్లు నెంబర్ HR 5517) బిల్లును ప్రవేశపెట్టారు. ప్రపంచంలోనే అత్యంత పెద్దవైన రెండు ప్రజాస్వామ్య దేశాలకు చెందిన గాంధీ, కింగ్ ఆశయాలను కొనసాగించాలని అందులో కోరారు.

అందులోనే మరో బిల్లును కూడా ప్రవేశపెట్టారు. గాంధీ - కింగ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల అంతర్జాతీయ అభివృద్ధి నిధుల సంస్థను ఏర్పాటు చేయాలని, దీనికి భారత చట్టాల కింద నెలకొల్పాలని కోరారు. అందుకోసం ప్రతి ఏటా 30 మిలియన్ డాలర్లను బడ్జెట్‌లో కేటాయించాలని కోరారు.

ఈ ఫౌండేషన్‌లో అమెరికా, భారత్‌కు చెందిన ప్రతినిధులు ఉంటారు. ఆరోగ్యం, కాలుష్యం, క్లైమేట్ చేంజ్, విద్య, మహిళాభ్యుదయం కోసం పనిచేసే ఎన్జీవోలకు ఆర్థికసాయం చేయడానికి ఈ నిధులు వెచ్చించాలని సూచించారు.

జాన్ లెవిస్ ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఆరుగురు డెమొక్రటిక్ ప్రజాప్రతినిధులు సమర్థించారు. అందులో ముగ్గురు భారతీయ అమెరికన్లు ఉన్నారు. అమీ బెరా, రో ఖన్నా, ప్రమీలా జయపాల్‌తో పాటు బ్రెండా లారెన్స్, బ్రాడ్ షెర్మాన్, జేమ్స్ మెక్ గవర్న్ బిల్లుకు మద్దతిచ్చారు.వీటితోపాటు మరో బిల్లును కూడా తీసుకుచ్చారు. గాంధీ - కింగ్ పేరు మీద విద్యార్థులకు ప్రోత్సాహకం అందించేందుకు ఓ స్కాలర్‌షిప్ తేవాలని కోరారు. అందుకోసం ప్రతి ఏటా 2 మిలియన్ డాలర్లు 2025 వరకు ఇవ్వాలని అభ్యర్థించారు. గాంధీ, కింగ్‌ల ఆశయాలు, ఫిలాసఫీని సదరు విద్యార్థులు మరింత అధ్యయనం చేసేందుకు, అందుకోసం ప్రముఖ స్థలాలకు వెళ్లేందుకు ఈ ఫండ్స్ వినియోగించాలి. ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ కోసం వారిద్దరి పేరుతో మరో అకాడమీని తీసుకురావాలని, అందుకోసం ఏటా 2 మిలియన్ డాలర్ల చొప్పున ఐదేళ్లు చొప్పున కేటాయించాలన్నారు.

ఇలాంటి బిల్లును పెట్టడం శుభపరిణామమని అమెరికాలో భారత్ అంబాసిడర్ హర్ష్ వర్ధన్ సింగాలా అన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయన్నారు. మరోవైపు గాంధీకి సంబంధించి రెండు బిల్లులు అమెరికన్ కాంగ్రెస్‌లో పెండింగ్‌లో ఉన్నాయి.
First published: December 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు