vitro fertilization: సరోగసి పిల్లల తల్లిదండ్రులు ఎవరంటే.. జపాన్‌ సంచలన బిల్లు

అద్దెగర్భం లేదా కృత్రిమ గర్భధారణతో (IVF) పుట్టే పిల్లల తల్లిదండ్రులు ఎవరన్న దానిపై కొన్నేళ్లుగా ఇక్కడ సాగుతున్న ధర్మసందేహానికి విరుగుడుగా ఈ బిల్లును తీసుకొచ్చారు.

advertorial
Updated: November 16, 2020, 7:55 PM IST
vitro fertilization: సరోగసి పిల్లల తల్లిదండ్రులు ఎవరంటే.. జపాన్‌ సంచలన బిల్లు
ప్రతీకాత్మకచిత్రం
  • Advertorial
  • Last Updated: November 16, 2020, 7:55 PM IST
  • Share this:
భారత్‌తో పాటు పలు పాశ్చాత్య దేశాల్లో కృత్రిమ గర్భధారణ (సరోగసీ) పద్దతిలో పిల్లలకు జన్మనిస్తున్నారు. అండం లేదా వీర్యాన్ని దాతల ద్వారా సేకరించి, వేరొక గర్భంలో ప్రవేశ పెట్టడం ద్వారా పిల్లలను కంటున్నారు. మరి ఆ పిల్లలకు తల్లిదండ్రులు ఎవరు? జన్మనిచ్చిన వారా? లేదంటే వీర్యం, అండం దానం చేసిన వారా? దీనిపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. అదే సమయంలో రచ్చ నెలకొంది. ఈ క్రమంలో విట్రో ఫర్టిలైజేషన్ ప్రక్రియతో జన్మించిన పిల్లల తల్లిదండ్రుల అంశంపై జపాన్ సరికొత్త బిల్లును రూపొందించింది. దాతలతో సంబంధం లేదని.. జన్మనిచ్చిన వారినే పిల్లల తల్లిదండ్రులుగా గుర్తిస్తూ బిల్లును తీసుకొచ్చింది. 3వ వ్యక్తి అయిన దాతలను గుర్తించకుండా.. జన్మనిచ్చిన వారినే చట్టరీత్యా తల్లిదండ్రులుగా గుర్తిస్తున్నట్టు బిల్లులో పేర్కొన్నారు.

దశాబ్దాలు చిక్కు ప్రశ్న:

జపాన్ దేశంలో గత కొన్ని దశాబ్దాలుగా ఈ విషయంపై స్పష్టత లేకపోవడంతో.. తాజాగా జపాన్ పార్లమెంట్ ఓ బిల్లును రూపొందించింది. అద్దెగర్భం (surrogacy) లేదా కృత్రిమంగా గర్భధారణ చేసే సమయంలో 3వ వ్యక్తి సాయం తీసుకోవడం ద్వారా కలిగే సంతానానికి చట్ట రీత్యా తల్లిదండ్రులు ఎవరనే అంశం సాగుతున్న మీమాంసకు తెరదించే ప్రయత్నంలో భాగంగా ఈ కొత్త బిల్లును అధికార, ప్రతిపక్షాలు కలిసి రూపొందించడం విశేషం.


జన్మనిచ్చిన వారే తల్లిదండ్రులు..

బిడ్డకు జన్మ ఇచ్చిన వారే తల్లిదండ్రులంటూ కొత్త బిల్లులో పేర్కొన్నారు. సాధారణంగా ఈ లిటిగేషన్లన్నీ 3వ వ్యక్తి ద్వారా అండం లేదా వీర్యం కొని తల్లిదండ్రులైన వారికి ఎదురవుతాయి. అసలు అద్దెగర్భం లేదా కృత్రిమ గర్భధారణతో (IVF) పుట్టే పిల్లల తల్లిదండ్రులు ఎవరన్న దానిపై కొన్నేళ్లుగా ఇక్కడ సాగుతున్న ధర్మసందేహానికి విరుగుడుగా ఈ బిల్లును తీసుకొచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న డైట్ (Diet అంటే జపాన్ పార్లమెంట్) సమావేశాల్లోనే ఈ బిల్లును పాస్ చేసేందుకు అవసరమైన సంపూర్ణ మద్దతు ఉండటంతో డిసెంబరు నెలాఖరుకల్లా ఈ బిల్లు చట్టంగా మారనుందన్నమాట.


దానం చేసిన వారు కాదు..
ఈ నయా బిల్లు ప్రకారం బిడ్డకు జన్మనిచ్చిన మహిళనే తల్లి హోదా పొందుతుంది. కానీ అండం దానం చేసిన 3వ వ్యక్తి కాదు. భర్త అంగీకారంతో 3వ వ్యక్తి దానం చేసిన వీర్యంతో భార్యకు సంతానం కలిగితే అటువంటి సంతానాన్ని తిరస్కరించే హక్కును భర్తకు లేకుండా ఈ చట్టం చేస్తుందని జపాన్ వివరిస్తోంది. కానీ తమ పుట్టుకకు కారణమైన వీర్య దాతలు (sperm doner), అండ దాతల (egg doner) వివరాలను, గోప్యతను తెలుసుకునే అవకాశం ఇలా పుట్టే పిల్లలకు లేకపోవడం విమర్శలకు కారణమవుతోంది. తమలో ఎవరి జీన్స్ ఉన్నాయో, తాము ఎవరి అంశతో పుట్టామో తెలుసుకునే అవకాశం పిల్లలకు లేకపోతే ఎలా అంటూ జపాన్ ఫెడరేషన్ ఆఫ్ స్పర్మ్ డోనర్స్ వాదిస్తోంది. జపాన్ లో అండం, వీర్యం అమ్మకాన్ని నిషేధించారు. అద్దె గర్భాన్ని కూడా ఈ దేశంలో నిషేధించారు. అయితే కృత్రిమ గర్భధారణకు సాయం చేసే 3వ వ్యక్తి వంశం, పూర్వాశ్రమ వివరాలు తెలుసుకునే అవకాశంపై కొత్త బిల్లు పరిశీలించనుంది. ఈమేరకు సరికొత్త నియమ నిబంధనలు రూపొందించేందుకు త్వరలో అన్ని పార్టీలతో కూడిన ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు.

వీరి సంగతేంటి?
జపాన్లో ఒంటరి మహిళలు, పురుషుల సంఖ్య పెరుగుతుండగా మరోవైపు స్వలింగ సంపర్క వివాహాలు పెరుగుతున్నాయి. ఇలాంటి వారు సంతానం పొందాలనుకుంటే స్పర్మ్ డోనర్స్ లేదా ఎగ్ డోనర్స్ ను ఆశ్రయించాల్సిందే. ఈనేపథ్యంలో అద్దె గర్భం లేదా స్పర్మ్ డోనర్స్, ఎగ్ డోనర్స్ కు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. కానీ వీరి అవసరాలను స్పృశించేలా తాజా చట్టం లేకపోవడం విశేషం. మరి ఈ నేపథ్యంలో ఇలాంటి వారి సంగతేంటో అర్థం కావడం లేదనే మరో చర్చ సాగుతోంది. ఇటీవలి కాలంలో జపాన్ లో స్పర్మ్ బ్యాంకులకు డిమాండ్ పెరుగుతోంది. వివిధ కారణాలతో సంతాన లేమితో బాధపడేవారు ఈ స్పర్మ్ బ్యాంకులను ఆశ్రయిస్తుండగా మరోవైపు కృత్రిమ గర్భధారణకు కూడా ఇలాంటి డోనర్లు అవసరమవుతున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: November 16, 2020, 7:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading