బీజింగ్‌లో షాకింగ్: వేదికపైకి మానవ మలంతో బిల్ గేట్స్

ఓ గాజు సీసాలో మానవ వ్యర్థాలు... తీసుకొచ్చి బిల్ గేట్స్ ప్రదర్శించారు. తిండి మాత్రమే మనుషులకు సరిపోదన్న ఆయన.. .పరిశుభ్రమైన మరుగుదొడ్లు కూడా మానవాలికి ఎంతో అవసరమన్నారు.

news18-telugu
Updated: November 7, 2018, 12:47 PM IST
బీజింగ్‌లో షాకింగ్: వేదికపైకి మానవ మలంతో బిల్ గేట్స్
వేదికపై మానవ మలంను ప్రదర్శిస్తున్న బిల్ గేట్స్
news18-telugu
Updated: November 7, 2018, 12:47 PM IST
బీజింగ్‌లో రీ ఇన్టెంటెడ్ టాయిలెట్ ఎక్స్ పో జరుగుతుంది. ఈ సందర్భంగా ఆ సదస్సుకు హాజరైన వలర్డ్ బిలియనీర్ బిల్ గేట్స్... మానవ మలంతో వేదికపైకి వచ్చారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఓ గాజు సీసాలో మానవ వ్యర్థాలు... తీసుకొచ్చి బిల్ గేట్స్ ప్రదర్శించారు. తిండి మాత్రమే మనుషులకు సరిపోదన్న ఆయన.. .పరిశుభ్రమైన మరుగుదొడ్లు కూడా మానవాలికి ఎంతో అవసరమన్నారు. ఈ విధంగా ఆయన స్వచ్చతపై జనానికి ఓ అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. ప్రతీ ఇంట్లో మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలన్నారు.

బీజింగ్‌లో రీ ఇన్టెంటెడ్ టాయిలెట్ ఎక్స్ పో


ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువమందికి పరిశుభ్రమైన మరుగుదొడ్లు లేవన్నారు బిల్ గేట్స్. అందుకే తాను ఈ విధంగా మలంతో వేదికపైకి వచ్చానన్నారు. చైనా అధినేత షీ జిన్‌ పింగ్‌ 'టాయిలెట్‌ విప్లవం' ప్రారంభించారు. ఈ విప్లవం తనను ఎంతగానే ఆకర్షించిందన్నరు.వేదికపై మానవ మలం ప్రదర్శిస్తున్న బిల్ గేట్స్


ప్రస్తుతం బీజింగ్ లో పర్యటిస్తున్న ఆయన, బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ తరఫున 'రీ ఇన్వెంటెడ్‌ టాయిలెట్‌ ఎక్స్‌పో' పేరిట జరిగిన సదస్సులో పాల్గొన్నారు. పారిశుద్ధ్య రంగంలో చవకైన నూతన ఆవిష్కరణలను ప్రజల ముందుకు తీసుకు రావడమే లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది.
First published: November 7, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...