ప్రపంచ బిలియనీర్ 'ఫినీ' యావదాస్తి దానం.. సాధారణ వ్యక్తిలా జీవితం

ప్రపంచ కుబేరుడు వారెన్ బఫ్ఫెట్ ఈ వారం ఫోర్బ్‌తో మాట్లాడుతూ “ఫినీ మనందరికీ ఒక ఆదర్శం’’ అన్నారు.

news18-telugu
Updated: September 17, 2020, 2:11 PM IST
ప్రపంచ బిలియనీర్ 'ఫినీ' యావదాస్తి దానం.. సాధారణ వ్యక్తిలా జీవితం
చక్ ఫినీ (Image: చక్ ఫినీ)
  • Share this:
ఐరిష్ అమెరికన్ బిలియనీర్, ఎయిర్‌పోర్ట్ రిటైల్ చైన్ డ్యూటీ ఫ్రీ షాపర్స్ (డిఎఫ్ఎస్) కోఫౌండర్ చార్లెస్ చక్ ఫీనీ ప్రపంచంలో అత్యంత ఉదారమైన వ్యక్తిగా నిలిచారు. ఫీనీ తన బార్య కోసం కొంత మొత్తాన్ని మాత్రమే ఉంచుకొని తన ఆస్తినంతా దానం చేశారు. మాజీ బిలియనీర్ అయిన 89 ఏళ్ల ఫినీ ప్రస్తుతం ఆయన భార్యతో కలిసి ఓ మధ్య తరగతి వ్యక్తిగా విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. తన ఆస్తి మొత్తాన్ని ఆయన ఫౌండేషన్ అయిన ‘అట్లాంటిక్ ఫిలాంత్రోపీస్’ ద్వారా దానం చేయనున్నట్లు 2012లోనే ప్రకటించారు. దాని ప్రకారమే తన యావదాస్తినీ దానం చేశారు. సోమవారం, తన భార్య మరియు ‘అట్లాంటిక్ ఫిలాంత్రోపీస్’ ఫౌండేషన్ బోర్డు సభ్యులు హాజరైన జూమ్ వేడుకలో ఆయన తన ఫౌండేషన్‌ను మూసివేస్తున్నట్లు సంతకం చేశారు.

ఫినీ చేసిన కృషికి, ఆయన దాతృత్వానికి యు.ఎస్. కాంగ్రెస్ తరపున బిల్ గేట్స్ మరియు హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి కృతజ్ఞతలు తెలుపుతూ సందేశాలను పంపారు. ఈ సందర్భంగా ఫినీ ఫోర్బ్స్‌తో మాట్లాడుతూ “తన జీవితంలో చాలా నేర్చుకున్నానని.. తాను బతికి ఉండగానే ఈ మంచి కార్యక్రమం పూర్తయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రయాణంలో మాతో చేరిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు’’ అని అన్నారు.

1984 నుండి ఫీనీ ‘అట్లాంటిక్ ఫిలాంత్రోపీస్’ ద్వారా విద్యాసంస్థలు, మానవ హక్కుల సంఘాలు మరియు సామాజిక కార్యక్రమాలకు లెక్కలేనన్ని నిధులు మంజూరు చేశారు. అమెరికాలో మరణ శిక్షను రద్దు చేయడానికి 62 మిలియన్ల డాలర్ల గ్రాంట్, ఒబామా కేర్ ఆమోదించడానికి మద్దతు ఇచ్చే ప్రచారాలకు 76 మిలియన్ల డాలర్ల గ్రాంట్ మరియు అతని అల్మా మేటర్ కార్నెల్ విశ్వవిద్యాలయానికి దాదాపు బిలియన్ డాలర్ల విరాలాలు అందజేశారు. బిలయనీర్ అయిన్పటికీ ఆయన శాన్ఫ్రాన్సిస్కోలోని ఒక మధ్య తరగతి అపార్ట్‌మెంట్లో నివసిస్తున్నారు.

ఫీనీ దాతృత్వంపై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ మాట్లాడుతూ.. తమ సంపాదన మొత్తాన్ని దానం చేసేందుకు మాకు ఒక దారి చూపించాడని, ఆస్తిలో సగం కాదు, మొత్తం దానం చేయాలంటూ తమలో స్పూర్తిని నింపారని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రపంచ కుబేరుడు వారెన్ బఫ్ఫెట్ ఈ వారం ఫోర్బ్‌తో మాట్లాడుతూ “ఫినీ మనందరికీ ఒక ఆదర్శం’’ అన్నారు.
Published by: Shiva Kumar Addula
First published: September 17, 2020, 2:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading