Home /News /international /

BILL CLINTON SAYS HE FEELS TERRIBLE THAT AFFAIR HAS UNFAIRLY DEFINED MONICA LEWINSKYS LIFE SK

మోనికాతో ఎఫైర్‌ కథ ఇదే.. అమెరికా మాజీ అధ్యక్షుడి సంచలన డాక్యుమెంటరీ

బిల్ క్లింటన్, మోనికా

బిల్ క్లింటన్, మోనికా

మోనికాతో గడిపితే కాస్త ఉపశమనం లభించేందని తెలిపారు. ఆమెతో ఓరల్ సెక్స్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి కాస్త ప్రశాంతంగా ఉండగలిగేవాడనని వెల్లడించారు బిల్ క్లింటన్.

    అమెరికా మాజీ అధ్యక్షడు బిల్ క్లింటన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టారు. 1990ల్లో మోనికా లెవిన్స్కీతో జరిపిన వివాహేతర సంబంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవును.. మోనికాతో చాలాసార్లు ఓరల్ సెక్స్‌లో పాల్గొన్నానని 'హిల్లరీ' అనే డాక్యుమెంటరీలో వెల్లడించారు బిల్ క్లింటన్. హిల్లరీ అనే 4 గంటల డాక్యు మెంటరీలో హిల్లరీ క్లింటన్, ఆమె భర్త బిల్ క్లింటన్ వేర్వేరుగా పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా మోనికాతో ఉన్న రిలేషన్‌షిప్‌‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బిల్ క్లింటన్. అధ్యక్షుడి హోదాలో వైట్‌హౌజ్‌లో ఉన్న సమయంలో ఒత్తిడి, నిరాశ, భయం,ఆందోళన, చికాకుకు గురయ్యే వాడినని.. వాటి నుంచి ఉపశమనం కోసం మోనికాతో ఎఫైర్ పెట్టుకున్నట్లు వెల్లడించారు.

    ఓ బాక్సర్ 30 రౌండ్ల పాటు రింగ్‌లో పోరాడిన తర్వాత ఎలా ఫీల్ అవుతాడో.. పని ఒత్తిడితో తాను అలా ఫీలయ్యే వాడినని చెప్పారు. అలాంటి సమయంలో మోనికాతో గడిపితే కాస్త ఉపశమనం లభించేదని తెలిపారు. ఆమెతో ఓరల్ సెక్స్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి కాస్త ప్రశాంతంగా ఉండగలిగేవాడనని వెల్లడించారు బిల్ క్లింటన్. ఐతే ఆ ఎఫైర్‌ మోనికాతో పాటు తన జీవితంలోనూ ఎన్నో పరిణామాలలకు దారితీసిందని చెప్పారు. బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మోనికా లెవిన్స్కీ వయసు 22 ఏళ్లు. ఆ సమయంలో వైట్‌హౌస్‌లో ఇంటర్న్‌షిప్ చేసేవారు మోనికా. అలా బిల్ క్లింటన్, మోనికా మధ్య ఎఫైర్ మొదలై.. కొన్నేళ్ల పాటు కొనసాగింది. అప్పట్లో అమెరికా రాజకీయాల్లో వీరి వ్యవహారం సంచలనం రేపింది.


    ఇటీవల మీటూ ఉద్యమంలో భాగంగా క్లింటన్‌తో ఉన్న సంబంధంపై పలు సందర్భాల్లో మాట్లాడారు మోనికా. అప్పట్లో తనకు జరిగిన అన్యాయం.. ఇప్పుడిప్పుడే తనకు తెలిసి వస్తోందని చెప్పారు. అప్పట్లో పడిన ఇబ్బందులను బహిరంగంగానే పంచుకున్నారు. కాగా, బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేశారు. డెమెక్రటిక్ పార్టీ తరపున బరిలోకి దిగిన ఆమె.. డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: America, Bill Clinton

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు