హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Biggest Asteroid : మరో 10 రోజుల్లో భూమిపై భారీ విధ్వంసం!

Biggest Asteroid : మరో 10 రోజుల్లో భూమిపై భారీ విధ్వంసం!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Biggest Asteroid May Hit Earth : ప్రపంచం అంతం కాబోతోందన్న వార్తలను మీరు చాలాసార్లు చదివి ఉంటారు. ఉల్క ఢీకొనడమే ఇందుకు కారణమని చెబుతుంటారు. పెద్ద ఉల్క భూమిని ఢీకొట్టబోతుందని, ప్రపంచం అంతం అవబోతుందని చాలాసార్లు తేదీలతో సహా వచ్చాయి,పోయాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Biggest Asteroid May Hit Earth : ప్రపంచం అంతం కాబోతోందన్న వార్తలను మీరు చాలాసార్లు చదివి ఉంటారు. ఉల్క ఢీకొనడమే ఇందుకు కారణమని చెబుతుంటారు. పెద్ద ఉల్క భూమిని ఢీకొట్టబోతుందని, ప్రపంచం అంతం అవబోతుందని చాలాసార్లు తేదీలతో సహా వచ్చాయి,పోయాయి. మరోసారి శాస్త్రవేత్తలు ఇదే జోస్యం చెప్పారు. సెప్టెంబర్ నెలలో భూమికి సమీపంలో భారీ ఉల్క పోయే అవకాశం ఉంది. రెండు వారాల తర్వాత భూమికి(Earth) అతి సమీపంలో ఓ భారీ గ్రహ శకలం(Asteroid) వెళుతుందని చెబుతున్నారు. ఈ రాయి పరిమాణం ప్రపంచంలోనే అతిపెద్ద టవర్ అయిన బిగ్ బెన్ టవర్ కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. శాస్త్రవేత్తలు దీనికి 2008 RW అని పేరు పెట్టారు. ఈ రాయి చాలా ఏళ్లుగా తిరుగుతోంది. ప్రతి మూడు నుండి నాలుగు వారాలకు అది భూమికి సమీపంలో వెళుతుంది. భూమి యొక్క గురుత్వాకర్షణ దానిని తన వైపుకు లాగితే అది విధ్వంసం తెస్తుంది.

శాస్త్రవేత్తల ప్రకారం, 2008 RW భూమికి చాలా దగ్గరగా వెళుతుంది. గణితశాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 13, 2008న మధ్యాహ్నం 1:50 గంటలకు RW సెకనుకు 10 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. భూమి నుండి దాని దూరం 6.7 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది, ఇది భూమిని గురుత్వాకర్షణ ద్వారా లాగడానికి సరిపోతుంది. అటువంటి పరిస్థితిలో అది భూమి వైపుకు లాగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.

Viral Video : ఏం డెడికేషన్..లైవ్ లో అడ్డొచ్చిన ఈగను మింగేసిన టీవీ యాంకర్

విధ్వంసం వస్తుంది

భూమిని ఢీకొడితే ఎక్కడ ఢీకొంటుంది అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ కారణంగా నాసా నిరంతరం దానిపై నిఘా ఉంచింది. 2008 RW గురించి మరింత సమాచారం ఇస్తూ.. ది స్కై నిపుణులు దీనిని మొదటిసారిగా 2 సెప్టెంబర్ 2008న కనుగొన్నారని చెప్పారు. ఇది వెయ్యి ఇరవై మూడు రోజుల్లో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇప్పటికి చాలాసార్లు భూమిని దాటిపోయింది. కానీ ఈసారి దూరం చాలా తక్కువ. దీంతో ఢీకొనే అవకాశాలు బాగా పెరిగాయి.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Asteroid, Earth, NASA

ఉత్తమ కథలు