Amazon: అమెజాన్‌కు బిగ్ షాక్.. భారీ జరిమానా విధించిన యూరోపియన్ యూనియన్.. ఎంతంటే..

అమెజాన్ లోగో

Amazon: 2018లో దీనిపై ఫ్రెంచ్ ప్రైవసీ రైట్స్ కంపెనీ ఈ అంశంపై దర్యాప్తు చేపట్టిందని.. దాని ప్రకారమే ఈ జరిమానా విధించారని బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం పేర్కొంది.

  • Share this:
    ప్రపంచంలోకి దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమెజాన్‌కు యూరోపియన్ యూనియన్ ఊహించని షాక్ ఇచ్చింది. ఈయూ ప్రైవసీ రూల్స్ ఉల్లంఘించినందుకు 886 మిలియన్ డాలర్లు( 746 మిలియన్ యూరో) భారీ జరిమానా విధించింది. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇది రూ. 6594 కోట్లు. లక్సెంబర్గ్ డాటా ప్రొటెక్షన్ అథారిటీ ఈయూ రూల్స్ ఉల్లంఘించినందుకు ఈ మేరకు జరినామా విధించింది. దీనిపై అమెజాన్ స్పందించింది. సీఎన్‌పీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై తాము న్యాయపోరాటం చేస్తామని అమెజాన్ తెలిపింది. 2018లో దీనిపై ఫ్రెంచ్ ప్రైవసీ రైట్స్ కంపెనీ ఈ అంశంపై దర్యాప్తు చేపట్టిందని.. దాని ప్రకారమే ఈ జరిమానా విధించారని బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం పేర్కొంది.

    746 మిలియన్ యూరోల జరిమానా అన్నది ఈయూ చరిత్రలోనే అత్యధికమని అన్నారు. ప్రైవేటు డాటాను హ్యాండిల్ చేసే వారి విషయంలో కఠినంగా ఉండాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. అంతకుముందు ఈ రకమైన రూల్స్‌ను ఉల్లంఘించినందుకు జనవరి 2019లో గూగుల్‌కు 57 మిలియన్ డాలర్ల జరిమానా విధించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: