Russia sanctions on USA :ఉక్రెయిన్‌కు అమెరికా ఆర్థిక సాయం అందించడాన్ని తీవ్రంగా పరిగణించిన రష్యా కీలక అడుగులు వేస్తోంది. అమెరికా వాసులపై నిషేధాజ్ఞలు విధిస్తోంది. రష్యాలోకి ప్రవేశించకుండా శాశ్వత నిషేధం విధించిన జాబితాను రష్యా తాజాగా అప్‌డేట్ చేసింది. ఇప్పటివరకు మొత్తంగా 963 అమెరికన్లపై ప్రయాణ నిషేధం విధించినట్లు పుతిన్ ప్రభుత్వం వెల్లడించింది. వీరంతా రష్యాలోకి శాశ్వతంగా ప్రవేశించలేరు. ఉక్రెయిన్‌కు బైడెన్ సర్కారు ప్రతిపాదించిన 40 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయానికి సెనెట్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో రష్యా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గతంలోనే అధ్యక్షుడు బైడెన్, విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్, సీఐఏ చీఫ్ విలియమ్ బర్న్స్‌పై ప్రయాణ నిషేధం విధించినట్లు రష్యా తెలిపింది. ఆ జాబితాలో మరికొందరి పేర్లు చేర్చడంతో మొత్తం సంఖ్య 963కు చేరినట్లు తెలిపింది. కానీ, అనూహ్యంగా డొనాల్డ్ ట్రంప్ పై రష్యా నిషేధం విధించలేదు.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన వ్లాదిమిర్ పుతిన్‌పై ఎలాంటి విమర్శలు చేయలేదు. ఆయన సొంత ఇంటెలిజెన్స్ అభిప్రాయాలను సైతం పక్కనబెట్టి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై బహిరంగంగా ప్రశంసలు కురిపించారు. పుతిన్‌కు వ్యతిరేకంగా ఆయన పెద్దగా చర్యలు తీసుకోలేదు. వీలైనంత వరకు ఆయనకు అనుకూలంగానే వ్యవహరించాడు. అయితే ట్రంప్ ప్రభుత్వంలో పనిచేసిన కీలక నేతల్లో మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియోపై మాత్రమే రష్యా నిషేధం విధించిందని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక పేర్కొంది.
ALSO READ Sri Lanaka Lifts Emergency : భారత్ భారీ సాయం..శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేత
అమెరికా ప్రముఖులపై రష్యా నిషేధాజ్ఞలు విధించడాన్ని పశ్చిమ దేశాలపై అది తీసుకున్న కౌంటర్ యాక్షన్‌గా చూస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని అమెరికా సహా యూరప్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా రష్యాను కట్టడి చేయడానికి ఆ దేశంపై అమెరికా, పశ్చిమ దేశాలు తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధించాయి. కానీ రష్యా మాత్రం వెనుకడుగు వేయలేదు. ఈ ఆంక్షలకు ప్రతీకారంగానే రష్యా ప్రభుత్వం అమెరికా ప్రముఖులపై నిషేధాజ్ఞలు విధించినట్టు అర్థమవుతోంది. . అయితే ఇవన్నీ లాంఛనప్రాయమేనని.. అమెరికాపై పెద్దగా ప్రభావం చూపవని నిపుణులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Donald trump, Joe Biden, Russia, Russia-Ukraine War, USA, Vladimir Putin