BIDEN SCOLDS JOURNALIST A STUPID SON OF A BITCH PVN
Joe Biden : జర్నలిస్ట్ ను బండ బూతులు తిట్టిన బైడెన్
జో బైడెన్(ఫైల్ ఫొటో)
Joe Biden : ఇబ్బందికరమైన ప్రశ్నను సంధించిన జర్నలిస్ట్‌ను ఉద్దేశించి బూతులు తిట్టారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. ఆయన తనలో తానే ఈ బూతు మాటను బయటపెట్టుకున్నప్పటికీ హాట్ మైక్‌లో అది రికార్డయింది. అందరికీ వినిపించింది. బైడెన్ నోటి దురుసు వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
USA President : ఎప్పుడూ హుందాగా, ప్రశాంతంగా కనిపించే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక్కసారిగా సహనం కోల్పోయారు. ఓ జర్నలిస్టుపై బూతులతో విరుచుకుపడ్డారు. కాస్త ఇబ్బందికరమైన ప్రశ్నను సంధించిన జర్నలిస్ట్‌ను ఉద్దేశించి బూతులు తిట్టారు. ఆయన తనలో తానే ఈ బూతు మాటను బయటపెట్టుకున్నప్పటికీ హాట్ మైక్‌లో అది రికార్డయింది. అందరికీ వినిపించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నోటి దురుసు వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బైడెన్ లో కొత్త వేరియేషన్ కనిపించడంతో ఆశ్చర్యపోతున్నారంతా.
రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని నివారించడానికి అమెరికా తీసుకున్న చర్యలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలను వివరించడానికి జో బైడెన్ జనవరి 24నతన అధికారిక నివాసం వైట్‌హౌస్‌లోని ఈస్ట్ రూమ్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. వైట్‌హౌస్ కార్యకలాపాలను కవర్ చేసే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున దీనికి హాజరయ్యారు. ప్రెస్ కాన్ఫరెన్స్ దాదాపుగా ముగింపుదశకు వచ్చిన సమయంలో ఫాక్స్ న్యూస్ ఛానల్ కరెస్పాండెంట్ పీటర్ డూసీ, అధ్యక్షుడు బైడెన్‌ను ద్రవ్యోల్బణంపై ఒక ప్రశ్న అడిగారు. ఈ మధ్యంతర కాలంలో ద్రవ్యోల్బణం ఏర్పడటానికి రాజకీయ స్థితిగతులు బాధ్యత వహించాల్సి ఉంటుందని భావిస్తున్నారా? అని సూటిగా ప్రశ్నించిన జర్నలిస్ట్ కి.."ద్రవ్యోల్భణం గొప్ప ఆస్తి" అంటూ వెటకారంగా సమాధానమిస్తూనే.."వాట్ ఏ స్టుడిప్.. సన్ ఆఫ్ బిచ్(లంజాకొడకా)’అని తనలో తాను అనుకున్నారు. ఈ వాక్యాన్ని బైడెన్ గట్టిగా ఉచ్ఛరించలేదు గానీ.. అక్కడి హాట్ మైక్‌లో రికార్డయింది.
మైక్ ఆన్‌లో ఉన్న విషయాన్ని గమనించని బైడెన్.. ఆ తర్వాత సిబ్బంది ఆ విషయం చెప్పడంతో సైలెంట్ అయిపోయారు. అయితే డూసీ సైతం ఆ కామెంట్లను సరిగ్గా వినలేకపోయాడట. ఆపై బ్రీఫ్ రూంలో ఆ కామెంట్లను విని చిన్నబుచ్చుకున్నాడట. అయితే ఈ ఘటన జరిగిన గంట తర్వాత వ్యక్తిగతంగా డూసీకి కాల్ చేసి మరీ బైడెన్ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. ‘అది తన వ్యక్తిగతంగా చేసిన కామెంట్ కాదని ఆయన ఆ జర్నలిస్ట్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. బైడెన్ క్షమాపణలతో ఈ వివాదం ముగిసినట్లయ్యింది.
మరోవైపు,రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఎలాంటి ప్రశ్నలు అడగొద్దంటూ జో బైడెన్ ముందే సూచించారని పీటర్ డూసీ తెలిపారు. ఈ విషయం మీద అమెరికా అంతర్గతంగా చర్చిస్తోందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ పిసాకీ ఆ తరువాత వివరణ ఇచ్చారు. మంత్రివర్గంలో దీన్ని చర్చించలేదని, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలను అరికట్టడానికే ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.