Home /News /international /

BIDEN AIDE HINTS INDIA MAY NOT FACE CAATSA SANCTIONS OVER RUSSIA S 400 DEAL LIKE TURKEY DETAILS HERE MKS

S-400: భారత్‌పై ఆంక్షలకు అమెరికా వెనుకడుగు.. చైనాకు చెక్ పెట్టాలంటే తప్పదుగా!

భారత్ ఎస్400 కొనుగోళ్లపై అమెరికా తాజా స్పందన

భారత్ ఎస్400 కొనుగోళ్లపై అమెరికా తాజా స్పందన

రష్యా తయారు చేసిన అత్యాధునిక ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను భారత్ కొనుగోలుచేయడంపై గుర్రుగా ఉన్న అమెరికా ఆంక్షల విధింపునకు మాత్రం వెనుకాడుతోంది. టర్కీపై చర్యలు తీసుకున్నట్లు ఇండియా పట్ల వ్యవహరించలేమని బైడెన్ సర్కారు గుర్తెరిగింది.

ఇంకా చదవండి ...
కొన్నాళ్లుగా భారత్ పట్ల ఆగ్రహంగా ఉన్న అగ్రరాజ్యం మెల్లగా మెత్తబడుతోందా? చైనాను నిలువరించాలంటే భారత్ సహాయం తప్పనిసరైన స్థితిలో అమెరికా తన పోకడను తగ్గించుకుంటోందా? అంటే అవుననే సమాధానమిస్తున్నాయి బైడెన్ ప్రభుత్వ వర్గాలు. రష్యా తయారు చేసిన అత్యాధునిక ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను భారత్ కొనుగోలుచేయడంపై గుర్రుగా ఉన్న అమెరికా.. ఒక దశలో కాట్సా ఆంక్షలను విధిస్తామనీ హెచ్చరించింది. ఎస్-400లను కొనుగోలుచేసిన టర్కీపై భారీ ఆంక్షలు విధించిన అమెరికా.. ఇండియాపైనా అదే రకమైన చర్యలు తీసుకుంటామనే డాంబికాన్ని ప్రదర్శించింది. కానీ ఇప్పుడు పూర్తిగా వెనుకడుగు వేసి, భారత్ పై ఆంక్షలు తీసుకోలేమని బాహాటంగా చెప్పేసింది. అమెరికన్ కాంగ్రెస్(పార్లమెంట్) సభ్యులకు బైడెన్ ప్రభుత్వ ప్రతినిధి ఇచ్చిన సమాధానంలో భారత్ పై ఆంక్షల విషయంలో క్లారిటీ వచ్చేసింది..

రష్యా నుంచి ఎస్ 400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలుచేయరాదని భారత్ ను వారిస్తున్నప్పటికీ ఆక్షల విధింపు మాత్రం ఉండబోదని అమెరికా పేర్కొంది. రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలపై కఠిన ఆంక్షలు విధించేలా ట్రంప్ హయాంలో 2017లో అమెరికా కాట్సా అనే చట్టాన్ని తెచ్చింది. అమెరికాకు ముప్పు అనుకున్న ప్రత్యర్థులపై కాట్సాను ప్రయోగిస్తున్నది. రష్యా నుంచి ఎస్400 మిస్సైళ్లను కొన్నందుకుగానూ టర్కీపైనా కాట్సా ఆంక్షలు విధించింది అమెరికా. ఇక తర్వాతి వంతు భారత్‌దే అనీ తొలుత సకేంతాలిచ్చినా, వ్యూహాత్మక కోణంలో ఇండియాకు మినహాయింపులు ఇవ్వక తప్పని పరిస్థితి.

ఫలించిన Revanth reddy రిక్వెస్ట్ -24న కాంగ్రెస్‌లోకి డీఎస్ -నమ్మకద్రోహులకు మళ్లీ నీడా?



భారత్ కు కాట్సా ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు టాడ్ యాంగ్, మార్క్ వార్నర్, జార్ కార్నిన్ తదితరులు తొలి నుంచీ బైడెన్ సర్కారును ఒత్తిడి చేస్తున్నారు. టర్కీపై ఆంక్షల నేపథ్యంలో భారత్ విషయంలో అనుసరిస్తోన్న విధానం ఏమిటని కాంగ్రెస్ సభ్యులు అడిన వివరణకు అమెరికా ఆంక్షల విధాన సమయన్వయ కర్త జేమ్స్ ఓబ్రెయిన్ సమాధానమిచ్చారు. ఈనెల 12న కాంగ్రెస్ సభ్యులకు ఇచ్చిన వివరణలో ఓబ్రెయిన్.. టర్కీని, భారత్ ను ఒకేగాటిన కట్టలేమని వ్యాఖ్యానించారు.

Hyderabad : బాయ్‌ఫ్రెండ్‌ను కత్తితో పొడిచిన ప్రేయసి.. నడిరోడ్డుపై అది చూసి..

చైనాతో భారత్ కు ఏర్పడిన ఘర్షణపూరిత వాతావరణం నేపథ్యంలో వారు(భారత్) రష్యా నుంచి ఎస్400 వ్యవస్థలను కొనడాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని, చైనాతో పోటీలో అమెరికాకు భారత్ మిత్రదేశంగా ఉంటోందని, ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా భారత్ కు కాట్సా నుంచి మినహాయింపు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఓబ్రెయిన్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అదీగాక భారత్, రష్యాలు సుదీర్ఘకాలంగా రక్షణ భాగస్వాములుగా ఉన్న విషయాన్నీ అమెరికా సర్కారు గుర్తిస్తున్నది.
Published by:Madhu Kota
First published:

Tags: India, Russia, USA

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు